హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మహేష్ కోడలు..!
ఇప్పటి వరకు టాలీవుడ్ లో కి ఎంతో మంది వారసత్వపు హీరోలు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ మద్య మెగాఫ్యామిలీ నుంచి నాగబాబు కూతురు కొణిదెల నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ అమ్మడు బుల్లితెరపై మాత్రం బాగా పాపులర్ అయ్యింది. ఇక కొంత మంది హీరోయిన్ల కూతుళ్లు ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ మాత్రం సాధించలేదు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనకోడలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చుకుంటోంది.
మహేష్ బాబు సోదరి మంజుల సంజయ్ స్వరూప్ల కూతురు జాన్వి హీరోయిన్గా పరిచమవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విటర్ ద్వారా ప్రకటించిన మంజుల.. జాన్వి తన మొట్టమొదటి షాట్లోనే కెమెరా ముందు ఎంతో సహజంగా నటించిందని తన ట్వీట్లో పేర్కొంది. సందీప్ కిషన్, అమీరా దస్తుర్, త్రిదా చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో జాన్వి ఓ ముఖ్య పాత్రలో నటించనుంది. జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో ఆడియెన్స్ ముందుకు రానుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.