Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Another Wicket Down In YSRCP.. Gudur MLA Sunil To Join TDP

By   /  April 6, 2016  /  Comments Off on Another Wicket Down In YSRCP.. Gudur MLA Sunil To Join TDP

    Print       Email

MLA SUNIL

మరో వైసీపీ ఔట్..!

InCorpTaxAct
Suvidha

 

 

 

వైసీపీ నుంచి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు.. ఓ ఎమ్మెల్సీ సైకిలెక్కేశారు. తాజాగా మరో ఎమ్మెల్యే జంప్ కొట్టేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. నెల్లూరు జిల్లా గూడురుకు చెందిన ఎమ్మెల్యే సునీల్.. ఏపీ మంత్రి నారాయణతో వచ్చి ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబును కలిసి వెళ్ళారు. ఈ సందర్భంగా తాను టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు ఎమ్మెల్యే సునీల్ స్పష్టం చేశారు.ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక మంత్రి నారాయణ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వైసీపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు.. ఓ ఎమ్మెల్సీ పచ్చ కండువా కప్పుకున్నారు. తాజాగా వీరి సరసన ఎమ్మెల్యే సునీల్ కూడా చేరిపోయారు. ఇక జ్యోతుల నెహ్రూ, వరుసుల సుబ్బారావు కూడా త్వరలోనే టీడీపీ చేరనున్నారు. దీంతో టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరుతుంది.

ఇదిలాఉండగా.. మరికొన్ని రోజుల్లో మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో ముమ్మర ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ కు కాస్తంత బ్రేక్ పడిందని భావిస్తున్న తరుణంలో .. తాజా వలసలు ఏపీ రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక సైకిల్ ఎక్కబోయేవారి లిస్ట్ లో ఉన్న ఎమ్మెల్యేల పేర్ల గురించి రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మరి వీరిని అడ్డుకునేందుకు జగన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారో తెలియాల్సి ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →