సీనియర్ నటుడు, ఎన్టీఆర్ సమకాలీనుడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు కన్నుమూశారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న నాగేశ్వరరావు గారు మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలోని కేర్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 91 ఏళ్లు.
ఏఎన్ఆర్ గా తెలుగుప్రజలకు సుపరిచితులైన నాగేశ్వరావు 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురంలో జన్మించారు. 1988లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అంతకుముందు పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య అవార్డులను స్వీకరించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.