
చిత్రం : ఆరాధన(1962)
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
రచన: శ్రీ శ్రీ
గానం : ఘంటసాల
******
విశేషాలు–ఆరాధన 1962 లో విడుదలైన తెలుగు సినిమా.ఈ సినిమా కథా నాయకుడు అక్కినేని నాగేశ్వరావు గారు అప్పటికే నాగేశ్వరావు రొమాంటిక్ కథానాయకుడిగా అగ్రస్థానంలో ఉన్నారు. ఆరాధన చిత్రంలోని కథానాయకుడు అంధుడు. దాన్ని అభిమానులు స్వీకరిస్తారా?,,,,, అని సందేహించారు. కథలో భలం ఉన్నందున చివరికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలోని పాట ఒకటి శ్రీ శ్రీ వ్రాశారు. అది నాహృదయంలో నిదురించె చెలీ …. భావోద్వేగ గీతాల రచయితగా ముద్రపడ్డ శ్రీ శ్రీ ఈ పాటను వ్రాసారంటే అప్పట్లో ఎవరూ నమ్మలేదు. అప్పట్లో శ్రీ శ్రీని ఎవరో ఆట పట్టించడానికి నీహృదయంలో నిదురించే చెలి ఎవరు అని ప్రశ్నించగా శ్రీ శ్రీ కమ్యూనిజం అని అన్నారని చాల మంది చెప్పుకున్నారు. ఆ పాట ఈ నాటికి తెలుగు వారి హృదయాలలో నిలిచే ఉన్నది. అత్యంత ప్రజారణ పొందిన ఈ సినిమాకు ఖర్చు పెట్టినది కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే. అందులో నాగేశ్వరావు గారి పారితోషికం ఇరవై అయిదు వేలు. ఆ సినిమా కొరకు మార్వాడి వద్ద తీసుకున్న 60 వేల రూపాయల అప్పు తీరనేలేదు. చివరికి ఈ సినిమా నెగిటివ్ హక్కులను నెల్లూరుకి చెందిన ఒకరికి 99 సంవత్సరాలకు గాను లక్షా పాతిక వేల రూపాయలకు అమ్మి అప్పు తీర్చారు.
*******
నా హృదయంలో నిదురించే చెలీ !
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై, వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
|| నా హృదయంలో ||
నీ కన్నులలోన దాగెనులే వెన్నెలసోనా
కన్నులలోనా దాగెనులే వెన్నెలసోనా
చకోరమై నిను వరించి
అనుసరించినావే కలవరించినావే
|| నా హృదయంలో ||
నా గానములో నీవే
ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలుకరించరావే
నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే
నిదుర కాచినానే
|| నా హృదయములో ||
ఈ సుమధుర గీతాన్ని ఇక్కడ https://www.youtube.com/watch?v=ooMI2r2v5ZU వినండి !
టీవీయస్.శాస్త్రి

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.