
చిత్రం-తాత మనవడు(1972)
సంగీతం-రమేష్ నాయుడు
గానం : వి.రామకృష్ణ
రచన : డా॥సి.నారాయణరెడ్డి
******
వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని, ఇప్పుడు మనము అనుసరించిన మార్గాన్నే ముందు ముందు మన పిల్లలు ఆచరిస్తారని చెప్పే సందేశాత్మక చిత్రం ఇది. దాసరి నారాయణరావు సినీ ప్రస్థానం (దర్శకునిగా) ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. “నీ అయ్యకు చేసిన ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా” అని కొడుకు తండ్రితో అనడమే చిత్రంలోని ప్రధాన కథాశం. పిల్లలు మన చర్యల్ని, నడిచే మార్గాన్ని గమనిస్తూ ఉంటారు అని చెప్పే చిత్రం; ఒక కొత్త
ఒరవడికి నాంది పలికి విజయవంతమైంది.ఎస్.వి.ఆర్, రాజబాబు అత్యద్భుత నటన, కొత్త తరహా సంభాషణలు, దర్శకత్వం, చక్కటి నేపధ్యగీతాలు(బాలు, రామకృష్ణ – అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం చి త్రవిజయానికి కారణభూత మయ్యాయి. చిత్రంలో హీరో, హీరోయిన్ల వంటి మూస పాత్రలు లేకపోయినా, తక్కువ బడ్జెట్తో నిర్మించినా ప్రేక్షకులు ఆదరించారు.
******
పల్లవి :
అనుబంధం ఆత్మీయత
అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం
వింత నాటకం… ॥
చరణం : 1
ఎవరు తల్లి ఎవరు కొడుకు
ఎందుకు ఆ తెగని ముడి
కొన ఊపిరిలో ఎందుకు అణగారని అలజడి
॥తల్లి॥
కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వరికీ…
ఎవ్వరికీ
అవి కాలుతున్నా… ఆ… అవి కాలుతున్నా
వెలుగులె కావాలి అందరికీ అందరికీ…
చరణం : 2
కొడుకంటూ నీకూ ఒకడున్నాడు
వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడు
నిన్ను కడసారైనా చూడ రాలేదు
వల్లకాటికైనా వస్తాడను ఆశలేదు
ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషను
ఏ తల్లీ కనగూడదు ఇలాంటి కొడుకును
ఇలాంటి కొడుకును…
చరణం : 3
కానివారి ముచ్చటకై కలవరించు మూఢునికి
కన్నవారి కడుపుకోత ఎన్నడైన తెలిసేనా
తారాజువ్వల వెలుగుల
తల తిరిగిన ఉన్మాదికి
చితిమంటల చిటపటలు వినిపించేనా (2)
ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=ImwwhpUZNAU వినండి!
టీవీయస్.శాస్త్రి

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.