Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Anupriya Patel brings important caste factor for BJP

By   /  July 6, 2016  /  Comments Off on Anupriya Patel brings important caste factor for BJP

    Print       Email

anupriyaఅమ్మ గెంటేసింది.. బీజేపీ అక్కున చేర్చుకుంది

 

InCorpTaxAct
Suvidha

 

 

రాజ‌కీయాల్లో ప్రేమానుబంధాలు.. ర‌క్త సంబంధాలు ఏవీ ఉండ‌వ‌నేది ఇప్ప‌టికి ఎన్నోసార్లు రుజువైంది.. నేటికీ అది కొన‌సాగుతూనే ఉంది. ఇలాంటి సంఘ‌ట‌నే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఓ పార్టీలో జ‌రిగింది. ఆ పార్టీలో ఓ త‌ల్లి త‌న కూతురినే స‌స్పెండ్ చేసి పార్టీ నుంచి గెంటేసింది. అయితే ఆమెను బీజేపీ అక్కున చేర్చుకుంది. అంతేకాదు కేంద్ర మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. వివ‌రాల్లోకి వెళ్లితే… ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ మిత్ర పార్టీ అయిన అప్నాదళ్‌ నుంచి అనుప్రియ నేడు కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే అనుప్రియ గతేడాది పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. అప్నాదళ్‌ వ్యవస్థాపకుడు, అనుప్రియ తండ్రి సోనే లాల్‌ 2009లో మృతిచెందారు. దీంతో ఆమె తల్లి కృష్ణ పటేల్‌ పార్టీ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి తల్లీకూతుళ్ల మధ్య విభేదాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అనుప్రియను ఆమె తల్లి సస్పెండ్‌ చేశారు.

అంతేగాక.. ఆమెను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించారు. అయితే అనుప్రియ సస్పెన్షన్‌ను ఆమె మద్దతుదారులు వ్యతిరేకించారు. ఆమె నిజమైన అప్నాదళ్‌ ప్రతినిధి అని, ఆమెను ఎవరూ బహిష్కరించలేరన్నారు. కాగా.. ఇప్పుడు అనుప్రియ కేంద్రమంత్రిగా నియమితురాలవడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →