అనుష్కశర్మకు ఆ స్టేటస్ ఎప్పుడొస్తుందో?
గ్లామర్‌లో అయినా పెర్ఫామెన్స్‌లో అయినా, అనుష్క శర్మ.. తనకన్నా రేసులో ముందున్న హీరోయిన్లతో పోటీ పడగలదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! అంతేకాదు కోహ్లీతో లవ్ ఎఫైర్ పుణ్యమా అని ఈమె పేరు నిత్యం మీడియాలో మార్మోగుతూనే వుంటోంది. ఇంకా చెప్పాలంటే ఆమె ఖాతాలో చాలా హిట్లు కూడా ఉన్నాయి. అయినా ఆమెకు ఎందుకో నెంబర్ వన్ హీరోయిన్ స్టేటస్ దక్కలేదు. తాజాగా ‘సుల్తాన్’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది అనుష్క శర్మ. సల్మాన్‌ఖాన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అనుష్క, రెజ్లర్‌గా కన్పించింది. కండలు తిరిగే శరీరం అవసరమని తొలుత భావించినా, ఆ తర్వాత ఆ ఆలోచనల్ని పక్కన పెట్టేసి, తనకున్న బక్కపలచని దేహంతోనే కానిచ్చేసింది. ఎలాగైతేనేం, అనుష్క ‘సుల్తాన్’తోనూ హిట్ అందుకుంది.
ఇక ఇప్పుడు అనుష్క శర్మ నెంబర్ వన్ హీరోయిన్ రేసులో దూసుకు పోతుందా.? అంటే, కష్టమేనని బాలీవుడ్ సినీ జనం అంటున్నారు. దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రా విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్నారనీ, వారితో పోల్చితే అనుష్కకి అంత సీన్ లేదన్నది వారి వాదన. ‘ఎవరి టాలెంట్ వారిదే.. నెంబర్ వన్ పొజిషన్ కోసం నేనెప్పుడూ ఆశపడలేదు.. ఆ మాటకొస్తే, అవకాశాల కోసమూ వెంపర్లాడలేదు.. వచ్చిన సినిమాలు చేసుకుపోతున్నానంతే.. నాకు దక్కిన పాత్రలకు న్యాయం చేస్తున్నానా? లేదా? అన్నదే నాకు ముఖ్యం..’ అంటూ ‘సుల్తాన్’ సక్సెస్ తర్వాత అనుష్క తనదైన స్టయిల్లో స్పందించడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.