Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Anuskha gets advise from Director RajaMouli

By   /  June 29, 2016  /  Comments Off on Anuskha gets advise from Director RajaMouli

    Print       Email

anuksha 2అనుష్క‌కు క్లాస్ పీకిన రాజ‌మౌళి

 

InCorpTaxAct
Suvidha

 

తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అగ్ర‌హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అనుష్క‌కు బాహుబ‌లి-2లో చిక్కులు ఎదుర‌వుతున్నాయి. సైజ్ జీరో చిత్రంతో కొంచెం ఒళ్ళు పెంచి ఏ హీరోయిన్ చేయ‌ని ప్ర‌యోగం చేసిన స్వీటీకి పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చిప‌డింది. ఏ ముహూర్తాన సైజ్ జీరో చిత్రంలో చేసిందో ఏమోగానీ అప్పట్నుంచి పెరిగిన బ‌రువును త‌గ్గించుకోవ‌డానికి నానా తంటాలు పడుతోంది. జాతీయ చిత్రంగా పేరు ప్ర‌ఖ్యాతులు సాధించిన బాహుబ‌లిలో దేవసేన క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తోంది. అయితే శ‌ర‌వేగంగా షూటింగ్‌ సాగుతున్న బాహుబ‌లి-2లో దేవ‌సేన పాత్ర‌లో న‌టించాలంటే ప‌ది కిలోలు త‌గ్గాల్సిందట‌. బాహుబ‌లి మొద‌టిభాగంలో ఏమాత్రం క‌న‌బ‌డ‌ని దేవ‌సేన క్యారెక్ట‌రే ఇప్పుడు రెండ‌వ భాగానికి జీవమ‌ట‌. క‌థ మొత్తం దేవ‌సేన చుట్టు తిరుగుతుండ‌టంతో ఒక ప‌క్క అయితే, యుద్ధ స‌న్నివేశాలు, గుర్ర‌పు స్వారీలు ఉంటాయి క‌బ‌ట్టే చిత్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఆమెను అర్జెంటుగా బ‌రువు త‌గ్గాల‌ని ఆంక్ష‌లు విధించిన‌ట్లు తెలుస్తోంది. అంతే కాదు ముద్దుగా బొద్దుగా త‌యారైన అనుష్క త‌న బ‌రువు కార‌ణంగా చిరంజీవి 150 చిత్రంలో న‌టించే అవ‌కాశాన్ని కూడా కోల్పోయింద‌ని సినీవ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. పౌరాణిక చిత్రంగా తెర‌కెక్కుతున్న బాహుబ‌లి కోసం అనుష్క యోగా, ఎక్స‌ర్‌సైజ్‌, మేడిటేష‌న్ల‌తో బ‌హు విధాలుగా క‌ష్ట‌ప‌డుతుంద‌ట‌. మ‌రీ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చెప్పిన‌ట్లుగా అనుష్క బరువు తగ్గుతుందో లేదో వేచి చూడాలి!

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →