Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Any rifts between Pawan and Mahesh?

By   /  April 9, 2016  /  Comments Off on Any rifts between Pawan and Mahesh?

    Print       Email

pawan and maheshఆ అనుమానం ఎందుకు వ‌చ్చిందో?

 

InCorpTaxAct
Suvidha

 

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని శాసిస్తున్న ప్ర‌ముఖ హీరోల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌రైతే.. మ‌రో హీరో మ‌హేష్ బాబు. వీళిద్ద‌రూ బాక్సాఫీస్‌ల‌ను బ‌ద్ద‌లు కొట్టే హీరోలు.. రికార్డులు సృష్టించాల‌న్నా.. పాత రికార్డుల‌ను చెరిపేయాల‌న్నా వీళిద్ద‌రూ రంగంలోకి దిగితే స‌రిపోతుంది. అంతేకాదు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌హేష్ బాబు ఇద్ద‌రూ మంచి స్నేహితుల‌ని సినిమా ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటారు. అయితే ఇటీవ‌ల ఒక వార్త దావ‌ణంలా వ్యాపించింది. మ‌హేష్‌కు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య స్నేహం చెడింద‌ని.. ఇద్ద‌రి మ‌ద్ద ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంద‌ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో  ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు  రాజీవ్ మ‌సంద్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఇంట‌ర్వ్యూ చేశాడు.

అలాంటిదేమీ లేదు…

మీకు.. మ‌హేష్‌కు శ‌త్రుత్వం ఏమైనా ఉంద‌ని రాజీవ్ మ‌సంద్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను అడ‌గ‌గా..అలాందేమీ లేద‌ని.. ఇవ‌న్నీ ఎలా వ‌స్తాయో కూడా అర్థం కావ‌న్నారు. మ‌హేష్‌కు అర్జున్ సినిమా సమయంలో పైరేసి విషయంలో సహాయం చేశానని, అలాగే మహేష్ తన జల్సా చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడని, అసలు తామిద్దరి మధ్య గొడవలు కాని శత్రుత్వం కాని ఏమి లేవని  తేల్చిపారేశాడు. దీంతో మ‌హేష్‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య ఏమీ లేద‌ని తేలిపోయింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →