Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP already no 1 per Chandrababu statistics, slams YS Jagan

By   /  March 16, 2017  /  Comments Off on AP already no 1 per Chandrababu statistics, slams YS Jagan

    Print       Email

jaganఇప్పటికే ఏపీ నెంబర్ వన్ అయిపోయింది: జగన్

ఏపీ బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు చెబుతున్న లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. 2029లో ఏపీ ముందుడుగు వేస్తుందని చెప్పారని అన్నారు. అలాగే 2050 నాటికి దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పారని గుర్తు చేశారు. అయితే తాము చంద్రబాబుకి ఓ ప్రశ్న వేస్తున్నామన్నారు.

InCorpTaxAct
Suvidha

 

ఐఎంఎఫ్ ఈ మధ్య విడుదల గ‌ణాంకాలు విడుద‌ల చేసిందన్నారు. అందులో ప్ర‌పంచ వ్యాప్తంగా జీడీపీ రేటు 3.1 శాతంగా ఉందన్నారు. అయితే భారత్ లో 7.1గా ఉందని తెలిపింద‌ని చెప్పారు.ఇక 2016-17లో ఏపీ జీడీపీ మాత్రం 11.61 శాతంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే ఏపీ నెంబ‌ర్‌ వన్ స్టేట్ అయిందన్నారు. అలాంటిది 2050 అని ఎందుకంటున్నారని ఎద్దేవ చేశారు.తప్పుడు ప్రచారాలు చేసుకోవడం ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు అలవాటుగా మారిందని ఆరోపించారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →