ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
ఆరోపణలు ప్రత్యారోపణలు.. తీవ్ర గందరగోళం మధ్య ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. బుధవారం శాసన సభలో పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అలాగే సాయంత్రం ద్రవ్య వినిమయ బిల్లు విషయంలో వైసీపీ ఆందోళన చేపట్టింది. తాము జారీ చేసిన విప్ అనుమతించాలని వైసీపీ డిమాండ్ చేసింది. అయితే 202 నిబంధన ప్రకారం ఓటింగ్ పెట్టాల్సినవసరమే లేదని మంత్రి యనమల స్పష్టం చేశారు. అయితే తాము ఓటింగ్ నిర్వహించాలంటూ కొన్ని రోజుల క్రితం లెటర్ కూడా ఇచ్చామని వైసీపీ నేతలు అన్నారు. అయితే వారి మాటలను స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదు. మూజువాణి ఓటుతో ద్రవ్య వినిమయ బిల్లును శాసన సభ ఆమోదిస్తున్నట్లుగా ప్రకటించారు. వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
దీంతో ఇప్పటివరకు ఏడుసార్లు అసెంబ్లీ సెషన్స్ జరిగాయి. ఇక క్వశ్చన్ అవర్ లో కొత్త సభ్యులకు అవకాశం కల్పించామని అధికార పక్షం తెలిపింది. అలాగే చర్చల్లో భాగంగా కొంతవరకు అర్ధవంతమైన చర్చలు జరిగాయని తెలియజేసింది. అయితే విపక్షాలు కావాలనే అనవసర రాద్ధాంతం చేశాయని ఆరోపించింది. వైసీపీ రెండు సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టి ఓడిపోయిందని విమర్శించింది. అయితే ప్రస్తుత సమావేశాలపై అధికార విపక్ష సభ్యలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకునే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.