Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP Assembly passed a resolution seeking to implement the assurances ..

By   /  March 17, 2016  /  Comments Off on AP Assembly passed a resolution seeking to implement the assurances ..

    Print       Email

AP Assembly

కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అసెంబ్లీ తీర్మానం..

InCorpTaxAct
Suvidha

 

ఏపీ విభజన చట్టంతోపాటు, రాష్ట్రానికి సంబంధించి పార్లమెంటులో ఇచ్చిన అన్ని హామీలను తక్షణం అమలు చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. చట్టపరమైన హామీలను అమలు చేయాలని అందులో కోరింది. అలాగే రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు కూడా కేటాయించాలని అసెంబ్లీ కోరింది.మరోవైపు.. శాసన మండలిలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇదే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విభజనతో ఆర్థికంగా, ఆదాయపరంగా ఏపీ నష్టపోయిందన్నారు. తక్షణం రెవెన్యూ లోటు భర్తీకి నిధులు విడుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225 కు పెంచాలని కూడా తీర్మానంలో కోరారు. అలాగే.. విశాఖలో రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఏపీకి ఇప్పటి వరకు చేసిన కేంద్రం చేసిన సహాయానికి అసెంబ్లీ ధన్యవాదాలు తెలిపింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆర్థిక శక్తిగా ఎదిగేలా పారిశ్రామికీకరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరింది. దీనికోసం పదేళ్లపాటు వంద శాతం ఎక్సైజ్‌ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు ఈ సాయం అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.

ఇక.. ఈ అంశంపై విపక్ష నేత జగన్ మండిపడ్డారు. ఏపీకి ఆర్ధిక సాయం అందించాలంటూ రాష్ట్ర సర్కారు చేస్తున్న విన్నపాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గత ఏడాది ఆగస్టు 31న అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నెల రోజుల్లోగా కేంద్రం అన్ని హామీలను నెరవేర్చకపోతే.. కేంద్రమంత్రి వర్గం నుంచి టీడీపీ మంత్రుల చేత రాజీనామా చేయిస్తామని.. కేంద్రాన్ని హెచ్చరించాలని సూచించారు. ఈ విషయంలో చంద్రబాబుపై తనకు నమ్మకం లేదన్నారు. అయితే ఏపీ కోసం తీర్మానానికి మద్దతు ఇస్తున్నామన్నారు.విభజన చట్టంలోని హామీల అమలు కోసం అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →