అసెంబ్లీలో నిరసన తెలిపిన వైసీపీ సభ్యులు..
ఏపీ అసెంబ్లీ వైసీపీ నేతల ఆందోళనల మధ్య సోమవారానికి వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే రోజా వ్యవహారంపై విపక్ష సభ్యులు పట్టుబట్టారు.ఆ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సభలో వైసీపీ సభ్యులు తీవ్ర నిరసనలు తెలపడంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను వాయిదా వేశారు. నిరసనలు తీవ్రంగా కొనసాగడంతో ఏపీ అసెంబ్లీ కాస్తా వాయిదాల సభగా మారింది. శనివారం వైసీపీ సభ్యులు నల్ల దుస్తులతో శాసన సభకు హాజరయ్యారు. సభ ప్రారంభమైన వెంటనే చర్చకు పట్టుపట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి.. సభను అడ్డుకున్నారు.స్పీకర్ ఎంత నచ్చజెప్పినా వినలేదు.. అయితే వైసీపీ నిరసనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.
ఇదిలాఉండగా.. ఉదయం అసెంబ్లీకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో ఆమె అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. రోజా దీక్ష చేపట్టడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దాదాపుగా మూడు గంటల పాటు రోజా ఎండలో దీక్ష చేపట్టారు. ఆమెకు హై బీపీ ఉండటంతో బాగా నీరసించి పోయారు.దీంతో అసెంబ్లీ అధికారులు ఆమెను నిమ్స్‌కు తరలించారు. ప్రసుత్తం వైద్యులు రోజాకు షుగర్, బీపీ సహా పలు వైద్యపరీక్షలు నిర్వహించారు. పాడేరు ఎమ్మెల్యే జి.ఈశ్వరి వైద్యులతో మాట్లాడి పర్యవేక్షిస్తున్నారు. ప్రసుత్తం రోజా ఆరోగ్యం నిలకడగా ఉందని, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.