Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP Bandh on 16th

By   /  April 13, 2018  /  Comments Off on AP Bandh on 16th

    Print       Email

16న రాష్ట్ర బంద్

InCorpTaxAct
Suvidha

 

 

 

 

 

 

* పిలుపునిచ్చిన ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి

* మ‌ద్ద‌తు తెలిపిన వైయ‌స్ఆర్‌సీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు

* ఉధృత‌మ‌వుతున్న హోదాపోరు

* రోడ్డెక్కుతున్న ప్ర‌జా సంఘాలు, పార్టీ నాయ‌కులు

డెక్క‌న్ అబ్రాడ్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న‌లు ఉధృత‌మ‌వుతున్నాయి. పార్టీల నాయ‌కులు, ప‌లు ప్ర‌జాసంఘాల వాళ్లు ధ‌ర్నాలు, దీక్ష‌లు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. అయినా కేంద్ర ప్ర‌భుత్వం స్పందించ‌డం లేదు. దీంతో ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి ఈ నెల 16న రాష్ట్ర బంద్ చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చింది.  ఈ బంద్‌కు వైసీపీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా బంద్ చేపడుతున్నట్టు ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిందని విమ‌ర్శించారు. బంద్‌లు చేయాలని తాము కోరుకోవడం లేదని, రాష్ట్ర  ప్రజల కోసం రోడ్డెక్కుతున్నట్టు పేర్కొన్నారు. కాగా బంద్‌లో అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్టు తెలిపారు. బంద్‌ను ఎవ్వరూ అడ్డుకోవద్దని, ప్రతి ఒక్కరూ పాల్గొని బంద్ విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ నెల 16న రాష్ట్ర బంద్‌కు సాధన సమితి ఇచ్చిన పిలుపునకు మద్దతు ఇస్తున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్ర‌త్యేక హోదా కోసం చిత్త‌శుద్ధితో పోరాటం చేయ‌డం లేద‌ని తెలుగుదేశం పార్టీపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఢిల్లీలో హ‌డావుడి చేసి వ‌చ్చిన టీడీపీ ఎంపీలు త‌ర్వాత ఎలాంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌క‌పోవ‌డం.. చంద్ర‌బాబు కూడా హోదాపై నోరు విప్ప‌క‌పోవ‌డం బాధ క‌లిగిస్తోంద‌ని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →