Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP BJP incharge Siddarth Nath blames Chandra Babu for special status!

By   /  May 16, 2016  /  Comments Off on AP BJP incharge Siddarth Nath blames Chandra Babu for special status!

    Print       Email

chandrababuఅవును.. బాబు అది కావాల‌ని ఎప్పుడూ అడ‌గ‌లేదు!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ప్ర‌త్యేక హోదాను తెస్తామ‌ని చెప్పిన ఏపీ సీఎం చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ ప్ర‌త్యేక హోదా అంశాన్నే పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. ఎప్పుడైన ప్ర‌తిప‌క్షాలు ప్ర‌త్యేక హోదా గురించి స‌ర్కార్‌ను ప్ర‌శ్నించిన‌ప్పుడ‌ల్లా  ఎక్క‌డో ఒక‌చోట ప్రెస్‌మీట్ పెట్టి ప్ర‌త్యేక హోదా ఏమైనా సంజీవినా.. ప్ర‌త్యేక హోదా వ‌స్తే అన్నీ అయిపోతాయా అంటూ ప్ర‌తిప‌క్షాల‌పై ఎదురుదాడిగి దిగేవారు. పైగా ప్ర‌త్యేక హోదాకంటే ప్ర‌త్యేక ప్యాకేజీ మేల‌నికూడా చెప్పేవారు. అయితే చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన ఈ రెండేళ్ల‌లో ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడిన సంద‌ర్భాలు చూస్తే త‌క్కువ‌నే చెప్పాలి. కేంద్రంపై  ప్ర‌త్యేక హోదా గురించి ఒత్తిడి తెస్తున్నామ‌ని.. అందుకే నెల‌కు రెండుమూడుసార్లు ఢిల్లీ వెళ్తున్నామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు మాట‌లు అబ‌ద్ధాలు అని ఏపీ బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల‌ ఇన్‌చార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

చంద్ర‌బాబు నాయుడు కేంద్రాన్ని ఎప్పుడూ కూడా ప్ర‌త్యేక హోదా గురించి అడ‌గ‌లేద‌ని సిద్ధార్థ్‌నాథ్ సింగ్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. రాష్ట్ర ముఖ్య‌మంత్రే ప్ర‌త్యేక హోదా గురించి అడ‌గ‌క‌పోతే ఆ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్ర రాజ‌ధాని నిర్మాణ కార్య‌క్ర‌మానికి భూమి పూజ‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆహ్వానించిన చంద్ర‌బాబు అక్క‌డ ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడ‌కుండా ప్ర‌త్యేక ప్యాకేజీ గురించి మాట్లాడారు. స‌మావేశ అనంత‌రం మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మ‌రిచిపోయాన‌ని చంద్ర‌బాబు స‌మాధానం ఇచ్చారు. దీన్ని బ‌ట్టి చూస్తే చంద్ర‌బాబుకు ప్ర‌త్యేక హోదాకంటే ప్ర‌త్యేక ప్యాకేజీ పైనే ఎక్కువ ఇష్టం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →