ఏపీ కేబినేట్ సమావేశం కీలక నిర్ణయాలు ఇవే..
శనివారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో పలు విభాగాల్లో ఉన్న 20వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. భేటీ అనంతరం మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియా సమావేశంలో కేబినేట్ సమావేశానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
కేబినేట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ..
ఈనెల 15 నుండి జిల్లాల పర్యటనకు సీఎం చంద్రబాబు బాబు శ్రీకారం.
అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం..
విశాఖ జిల్లాలో ఐఐఎం..తాడేపల్లి గూడెంలో నిట్ ఏర్పాటుకు నిర్ణయం.
ఉచిత ఇసుక విధానం కొనసాగించాలని నిర్ణయం..
ఇసుకను అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు..
ఏప్రిల్ 20,21 తేదీల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ.. బాధితులకు ఉపశమనం కలిగించే విధంగా చూడాలని సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ..
డబుల్ టైం రిజిస్ట్రేషన్లు లేకుండా ఉండేందుకు సెక్షన్ 22 బి పరిచయం.. రిజిస్ట్రేషన్ ఆపు చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు అప్పగింత..
విజయవాడలో ఎం కన్వేషన్ హాల్ లో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించాలని నిర్ణయం..
14వ తేదీన అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు నిర్వహణ.. ఆరు లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు..
పూలే జయంతి ఉత్సవం..బాబు జగ్జీవన్ రాం జయంతి ఉత్సవాలను విజయవాడలో నిర్వహించాలని నిర్ణయం..
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.