వైసీపీపై చంద్రబాబు ఫైర్..
ఏపీ సీఎం చంద్రబాబు శాసన సభలో వైసీపీపై నిప్పులు చెరిగారు. రౌడీయుజం చేస్తే కోరలు పీకేస్తానంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోలార్ పవర్ రంగం, వీటీపీఎస్ కృష్ణపట్నం కొత్త యూనిట్ లో కుంభకోణాలు జరిగాయని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపణలు చేశారు. దీంతో చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చేసిన ఆరోపణలు నిరూపించాలని లేనిపక్షంలో శాసనసభకు రావద్దని గట్టిగా సూచించారు. అసత్యాలు మాట్లాడుతుంటే.. మిగిలిన వాళ్ళు సిగ్గు లేకుండా చప్పట్లు కొడుతున్నారంటూ మండిపడ్డారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలను ముఖ్యమంత్రి నిలదీశారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే కాదు.. వాటిని ఖచ్చితంగా నిరూపించి చూపించాలని చంద్రబాబు సూచించారు. ఇలాగే అసత్య ఆరోపణలు చేస్తుంటే.. వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కు సూచించారు. వైసీపీ దివాళుకోరతనం రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం చేస్తే కోరలు తీస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.