Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP CM Chandrababu Naidu meet arun jaitley

By   /  February 10, 2016  /  Comments Off on AP CM Chandrababu Naidu meet arun jaitley

    Print       Email

cbn - arun jaitly1

కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు

InCorpTaxAct
Suvidha

ఢిల్లీలో పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడిపారు. మంగళ వారం ఉదయం నుంచి కేంద్రమంత్రులతో బాబు వరుసగా భేటీలు నిర్వమించారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలిసిన చంద్రబాబు ఏపీ కష్టాలను ఏకరువు పెట్టారు.రాష్ట్రానికి రెవెన్యూ లోటు తీవ్రంగా ఉందని తెలిపారు. రెవెన్యూ లోటు కింద రూ. 12,106 కోట్లు మంజూరు చేయాల్సిందిగా కోరారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేకహోదా కూడా చర్చించారు.వచ్చే సమావేశాల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం.అలాగే విదేశీ ఆర్థికసాయాన్ని రూ.3 వేల కోట్లకు పెంచాలన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఏటా రూ.200 కోట్ల చొప్పున గ్రాంట్‌ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు జైట్లీకి విన్నవించారు.వీటితో పాటు విశాఖలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజి ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌కు రూ.7,444 కోట్లు ఇవ్వాలని కోరారు. పారిశ్రామికాభివృద్ధికి నాలుగేళ్లపాటు రూ.1500 కోట్లు ఇవ్వాలని సీఎం కేంద్రమంత్రిని కోరారు. వీటితో పాటు అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.ఓవరాల్ గా ఏపీ ముఖ్యమంత్రి అరుణ్ జైట్లీతో రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు మరింత ఆర్ధిక సాయం అందించాలని విన్నవించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →