ష్యూరిటీల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టోద్దు: ఏపీ సీఎం చంద్రబాబు
రైతులకు, ఇతర వర్గాల వారికి తక్కువ మొత్తంలో ఇచ్చే రుణాలకు డిపాజిట్లు, ష్యూరిలీలు లాంటి వాటిని డిమాండ్ చేసి ఇబ్బందులకు గురిచేయవద్దని ఏపీ సీఎం చంద్రబాబు బ్యాంకర్లకు సూచించారు. సెక్రటేరియట్ లో రాష్ట్ర బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ భేటీకి ముఖ్యమంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మూడు లక్షలలోపు రుణాలు ఇచ్చేందుకు రైతులను ఇది పెట్టవద్దని ముఖ్యమంత్రి బ్యాంకర్లను కోరారు. తక్కువ మొత్తంలో ఇచ్చే రుణాలకు రైతులు, ఇతర వర్గాల ప్రజలను ష్యూరిటీలు, డిపాజిట్లులాంటివి అడగవద్దన్నారు. ఈ అంశంపై తాను ఎస్ఎల్ బీసీ చైర్మన్ తో మాట్లాడానన్నారు. దీనికి ఆయన కూడా అంగీకరించారని తెలిపారు.
ఎస్ఎల్బిసి తీసుకున్న నిర్ణయాలను బ్యాంకర్లు అమలు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. బ్యాంకింగ్ కన్సల్టెంట్లు లేని చోట స్వయం సహాయక సంఘాల మహిళల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సంఘాల సభ్యుల ద్వారా లావాదేవీలు నిర్వహించాలన్నారు. దీనివల్ల వారికి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు. అదేవిధంగా ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చుదిద్దుతామన్నారు. రాష్ట్రంలో సేద్యపు కుంటల తవ్వకాలకు.. రెయిన్గన్స్తో పంట తడి అందించేందుకు బ్యాంకులు తమవంతు సహకారం అందించాలని కోరారు. ఏపీలో సర్వీస్ సెక్టార్ కి అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి బ్యాంకర్లు సహకారం అందిస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.