Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP CM Chandrababu Naidu Meets PM Modi over AP Bifurcation problems

By   /  January 12, 2018  /  Comments Off on AP CM Chandrababu Naidu Meets PM Modi over AP Bifurcation problems

    Print       Email

విభజన హామీలు నెరవేర్చాలని ప్రధాని మోదీని కోరిన సీఎం చంద్రబాబు

Suvidha
Biryani Pot

 

 

 

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విభజన హామీలపై చర్చించారు. ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని గట్టిగా కోరారు. అలాగే రాష్ట్రంలో కేంద్ర, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. మొదటి ఏడాది రెవెన్యూ లోటు రూ. 16,078.76 కోట్లు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ. 7,500 కోట్లు ఇస్తామంటూ చెప్పిందని తెలిపారు. కాని రాష్ట్రానికి వచ్చింది మాత్రం రూ. 3,979 కోట్లు మాత్రమే అని అన్నారు. మిగిలిన మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని కోరారు. విదేశీ ప్రాజెక్టుల ప్రతిపాదనల మొత్తం రూ. 18,857 కోట్లు అని అన్నారు.

వీటిలో రూ. 8,349 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారని చెప్పారు. అలాగే నియోజక వర్గాలను పెంచాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ. 58,319.60 కోట్లు అవసరం అవుతుందని తెలిపారు. కేవలం పునరావాసం కోసమే రూ. 33,858 కోట్లు అవరసరం అని అన్నారు. ఈ మొత్తాన్ని కేంద్రం ఇవ్వాలని కోరారు.దీంతోపాటు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరారు. 11 జాతీయ విద్యా సంస్థల నిర్మాణానికి నిధులు సమకూర్చాలని కోరారు. దుగరాజపట్నం పోర్టును నిలిపివేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Invitation For World Telangana Convention 2018 – June 29th, 30th and July 1st Houston, TX

Read More →