Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP CM Chandrababu Serious Comments on YCP..

By   /  March 4, 2016  /  Comments Off on AP CM Chandrababu Serious Comments on YCP..

    Print       Email

chandra babu naidu-bఅమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకే కుట్ర: ఏపీ సీఎం చంద్రబాబు

 

InCorpTaxAct
Suvidha

అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టీడీపీ మంత్రులు, నేతలు భూ దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన స్పందించారు. కొన్ని పార్టీలు, పత్రికలు తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం భూములు కొనుగోలు చేస్తే.. వాటిపై సర్కారు ఎందుకు విచారణ జరిపించాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీపై ఆయన మండిపడ్డారు. పత్రికను అడ్డంపెట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇష్టానుసారంగా రాస్తే సహించబోమన్నారు. అమరావతిలో పెట్టుబడుల అంశంపై మాట్లాడేందుకు బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ వచ్చారని గుర్తు చేశారు. తనను లండన్‌లో సమావేశాలకు పిలిచారని తెలిపారు. ఆ భేటీకి తాను హాజరు కాబోతున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సమయంలో ఏదిపడితే అది రాస్తే ఎలా అని ప్రశ్నించారు. పనిలో పనిగా సాక్షి పత్రికపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ పత్రిక ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందన్నారు. అంటే అది ప్రభుత్వ ఆస్తేనని అన్నారు.

 

ప్రభుత్వ ఆస్తి అయి ఉండి సర్కారుకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తోందని చంద్రబాబు అన్నారు. దీనిపై చర్యలు ఎలా ఉండాలన్నదానిపై ఆలోచిస్తున్నామన్నారు. అమరావతి భూముల కొనుగోలుపై ఏదేదో రాసేసి విచారణ చేయమంటే ఎందుకు చేస్తామని అన్నారు. సొంతానికి భూములు కొనుక్కుంటే ఎందుకు చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. అసలు ఆస్తులే కొనకూడదు, వ్యాపారాలు చేయకూడదు అంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి విపక్షాలు సహకరించాలని ఆయన సూచించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →