Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

AP CM Chandrababu who denounces the agitation against Amarnath pilgrims

By   /  July 11, 2017  /  Comments Off on AP CM Chandrababu who denounces the agitation against Amarnath pilgrims

    Print       Email

అమ‌ర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు

InCorpTaxAct
Suvidha

 

 

 

అమ‌ర్‌నాథ్ యాత్రికులపై తీవ్ర‌వాదులు దాడి చేసిన ఘ‌ట‌న‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ ద్వారా సంతాపం ప్రకటించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వార్త త‌న‌ని పూర్తిగా క‌ల‌చివేసింద‌న్నారు. మృతి చెందిన వారి కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ లో పేర్కొన్నారు. ఇలాంటి ఉగ్ర‌దాడుల‌ను రాజ‌కీయ, రాజ‌కీయేత‌ర పార్టీలు కూడా ఖండించాల‌ని సూచించారు. నిందితుల‌కు ఎలాగైనా శిక్ష ప‌డేలా చేయాల‌ని సూచించారు.

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సోమవారం రాత్రి అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. రాత్రి 8.20గంటల ప్రాంతంలో అనంత్‌నాగ్‌కు సమీపంలోని బటంగూ ప్రాంతంలోని పోలీసులకు సంబంధించిన ఓ వాహనంపై ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరిపారు. పోలీసులు ప్రతిఘటించి ఎదురుకాల్పులకు పాల్పడటంతో ముష్కరులు మరింత చెలరేగిపోయారు. అదే సమయంలో హైవేపైకి వచ్చిన అమర్‌నాథ్‌ యాత్రికులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు యాత్రికులు మృతిచెందారు. మరో 11 మందికి గాయాలు అయ్యాయి. ఇక ఈ ఘటనకు పాల్పడింది లష్కరే తోయిబా ఉగ్రవాదులని కశ్మీర్‌ ఐజీ వెల్లడించిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →