Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP CM Y.S. Jagan’s Dallas meeting is a grand success!

By   /  August 19, 2019  /  No Comments

    Print       Email

ప్రవాస తెలుగు సభ – ఆంధ్ర ప్రదేశ్ CM  శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిచే

జగన్ ముఖ్యమంత్రి అయినా తరువాత మొట్ట మొదటి సారిగా జరిగిన ప్రవాస తెలుగు ప్రజల్ని ఉద్దేశించిన మహా సభ డల్లాస్ నగరంలో ఎంత అట్టహాసంగా జరిగింది అంటే చరిత్రలో ఏ తెలుగు ముఖ్యమంత్రికి కూడా ఇలాంటి స్పందన ఇప్పటివరకు రాలేదు ఇకమీద భవిష్యత్తులో ఎవరికి కూడా రాక పోవచ్చు.అమెరికాలోని వివిధ ప్రాంతాలనుండి  సామాన్య ప్రజలు ,అభిమానులు తమ సొంత ఖర్చుతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి
డల్లాస్ నగరంలోని హాచిసొన్ కన్వెన్షన్ సెంటర్ మరియు అనుబంధ Omni హోటల్ లో  బస చేసి జగన్ కోసం నిరీక్షించారు.గడచినా మూడు రోజులు అంతా కూడా  డల్లాస్ పరిసర ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణం నెలొకొని ఉంది మరియు జగన్తో  టీం గా  వచ్చిన MLA లు అందరూ మీట్&గ్రీట్స్ తో వారి ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి పెట్టుబడుల అవస్యకతలను మరియు నియోజక వర్గ అభివృద్ధి కోసం ప్రవాస ప్రజల సహకారాన్ని కోరారు.ఎంతో మంది వ్యాపార వేత్తలు తమ ఇష్టాన్ని తెలియచేసి  ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పట్టం కట్టేలా చర్యలు తీసుకోనున్నారు.
జగన్ అమెరికాలో దిగగానే వివిధ దేశాల దౌత్యవేత్తలతో సమావేశం  నిర్వహించి .ఆంధ్ర రాష్ట్ర రాయితీ & పన్ను విధానాలు మరియు ప్రభుత్వ ప్రోత్సహాకాలను వారికి వివరించి వారిని మన రాష్ట్రానికి ఆహ్యానించారు.వివిధ రాష్ట్రాల కౌంటీ మేయర్లు మరియు సెనేటర్స్ జగన్ను కలుసుకునేందకు ఆసక్తి కనబరిచారు.పలు రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతో  సభలో ఉర్రుతలూగించారు ముఖ్యంగా రిచర్డ్ అనే అమెరికాకు చెందిన వ్యక్తి తెలుగు నేర్చుకుని తెలుగు స్పష్టంగా మాట్లాడి తాను జగన్కు ఎలా ఫ్యాన్ అయ్యానో అని తెలుగులో వివరించడం సభికులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

InCorpTaxAct
Suvidha


జగన్ అనే నేను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంతిగా మీముందుకు అని  ప్రసంగం మొదలవ్వగానే సభికుల స్పందన ,జయ జయ ద్వానాలతో కన్వెన్షన్ సెంటర్ కొన్ని నిమిషాల పాటు మార్మోగి పోయింది.


జగన్ తన మార్కు ప్రసంగంతో అందరిని గ్రీట్ చేసి నాకు ఒక డ్రీం అంటూ martin luther king jr నినాదాన్ని చదివి వినిపించారు,తమ ప్రభుత్వ విధానాలు మరి ప్రవాస భారతీయులు ఆంధ్ర రాష్ట్రానికి ఎలా సహకరించాలి అంటూ నూతన విధానాలను వివరించారు.ఎవరైనా ప్రవాస భారతీయులు పెట్టుబడు పెట్టాలన్న నేరుగా CM పోర్టల్లో అప్లై చేసే విధముగా ఒక ప్రోగ్రామ్ను త్వరలోనే రూపొందించామని   తెలియచేసారు ,తద్వారా నేరుగా CMO నే పర్యవేక్షిస్తారు ఎలాంటి అవకతవకలు మరియు అవినీతి జరగకుండా పరిశ్రమలకు ప్రొత్సాకాలనీ మరియు త్వరితగతిన అనుమతుతులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు,ఇంకా ఎవరైనా దాతలు వారి వారి ప్రాంతాలలోని బస్సు షెల్టర్స్ కానీ,పాఠశాలకు అభివృద్ధికి  
సహాయ సహకారాలు అందించిన యెడల దానికి వారి పేరునే పెడతామని తెలియచేసారు .వైసీపీ విజయానికి ప్రవాసాలు చేసిన సహాయం తాను ఎన్నటికీ మరువను అని  అనగానే సభ మరొక్కసారి మార్మోగిపోయింది.ప్రవాసులందరిని ఏడాదికి ఒక్క సారి  అయినా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి తల్లి తండ్రులను ,బంధువులను మరియు స్నేహితులను కలుసోకోవాలని అభ్యర్ధించారు.ఇంకా డల్లాస్ లోకల్ మేయర్ మరియు రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తులు ప్రసంగించి తెలుగు కల్చర్ ను మెచ్చుకున్నారు అలాగే DR ప్రేమ్ సాగర్  రెడ్డి గారు రాజన్న మరియు జగన్ ఔన్నత్యాన్ని గుర్తు చేశారు.
చివరగా ఒక సామాన్య ప్రవాసునిగా ఇంతటి స్పందన ఇంతకముందు ఎలాంటి నాయకుడికి చూడలేదు కాయకర్తలు అందరూ  తమ సొంత ప్రోగ్రాంలాగా అందరూ భావించి చక్కటి క్రమ శిక్షణతో కార్యక్రమం ఆసాంతం ఒక శిక్షకుడిలాగా పని చేశారు ,ఎవరికీ ఎలాంటి ఆటంకాలు లేఉండా సరైన సమయానికి భోజన సదుపాయాలను అందించారు .

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →