రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం: బాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు. ఏమీ లేని రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే నిలదొక్కకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, విభజన కష్టాల నుంచి ఏపీ ప్రజలు ఇంకా కోలుకోలేక పోతున్నారన్నారన్నారు. “మా పట్ల 80 శాతం ప్రజల్లో తృప్తి ఉండాలి. ఇప్పటికే ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగింది. ఈ సంవత్సరం ఇంకా వినూత్నంగా చేస్తాం. 43 లక్షల కుటుంబాలకు పెన్షన్, 4 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం. ఈ ఊరిలో కాకుంటే మరో వూరిలో రేషన్ తీసుకోవచ్చు. ఈ నెల తీసుకోకుంటే మరో నెల తీసుకోవచ్చు. ఐదు లక్షల బీమా తెచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ, బ్రాహ్మణ కార్పొరేషన్లు పెట్టాం. అవసరమైన వారందరికీ వంటగ్యాస్ సిలిండర్లు! ఎన్ని కావాలంటే అన్ని! గ్రామీణ ప్రాంతాల్లో గత ఏడాది 4వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు వేశాం. ఈసారి ఐదు వేల కిలోమీటర్లు వేస్తాం. గ్రామీణ మౌలిక పదుసాయాల రూపురేఖలు మార్చాం. భూగర్భజల మట్టం పెంచుతున్నాం. వందశాతం ఇళ్లకు విద్యుత సౌకర్యం! గృహ నిర్మాణంలో 6 లక్షల కొత్త ఇళ్లను లక్ష్యంగా పెట్టుకున్నాం! ఇన్ని పనులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? పేదలను ఆర్థికంగా పైకి తేవడానికి, అసమానతలు తగ్గించడానికే ఇవన్నీ చేస్తున్నాం. మా పట్ల, మా పాలన పట్ల 80 శాతం ప్రజల్లో సంతృప్తి ఉండాలి. ఇదే మా లక్ష్యం“ అని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కష్టాల్లో ఉందని, అయినా రెండేళ్లలో అభివృద్ధి సాధించామని బాబు అన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా, సవాలుగా తీసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, ఆ ఇబ్బందులను గుర్తుకు తెచ్చుకుని, కసితో, కక్షతో కష్టపడి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రజలకు బాబు పిలుపునిచ్చారు. దెబ్బతీయాలని ప్రయత్నించిన వారు బాధపడేలా… మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రానికి జరిగిన.. జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకే నవ నిర్మాణ దీక్ష చేపడుతున్నట్లు బాబు వెల్లడించడం గమనార్హం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.