ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ అసెంబ్లీ తీర్మాణం: సీఎం చంద్రబాబు నాయుడు
విభజన వల్ల ఏపీకి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఏపీకి ప్రత్యేక హోదాపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. పార్లమెంట్ తలుపులు మూసేసి విభజన చేశారనిఆరోపించారు. ఎవరితోనూ సంప్రదించకుండానే విభజన పూర్తి చేశారని అన్నారు. విభజన శాస్త్రీయంగా జరగలేదని ఆరోపించారు. విభజనలో ఇచ్చిన హామీల ప్రకారం అసెంబ్లీ స్థానాల సంఖ్యను 225కు పెంచాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు మంజూరు చేయాలని సూచించారు.
స్థానికత అంశంపై తక్షణం రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని కోరారు. రాష్ట్రానికి బయట ఉన్న ఆస్తుల పంపిణీ త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే ఉద్యోగుల విభజననుకూడా స్పీడ్ గా చేయాలని చంద్రబాబు అన్నారు. పన్నుల రాబడిలో వ్యత్యాసాలను సరిచేయాలన్న ఆయన.. కేంద్రం చేసిన సాయానికి ధన్యవాదాలు తెలియజేశారు. 2015-16లో పోలవరం ప్రాజెక్ట్‌కు ఖర్చు చేసిన రూ. 2,485 కోట్ల నిధులను తిరిగి ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ. 4092 కోట్లు ఖర్చుచేశామన్నారు. ఈ సొమ్మును కేంద్రం ఇవ్వాలన్నారు. పరిశ్రమలు, సేవల రంగంలో ఏపీ ఎంతో వెనుకబడిందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలపకపోతే ప్రాజెక్ట్ కల సాకారమయ్యేది కాదన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ఎంతో చొరవ తీసుకున్నారని అన్నారు. 2018 నాటికి పోలవరం ఫేజ్-1 పూర్తి చేస్తామని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలన్నారు. అలాగే రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు.
వీటితో పాటు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్నంలో పోర్టు, కేంద్రం మంజూరు చేసిన విద్యాసంస్థలకు నిధులు ఇవ్వాలన్నారు. స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించకపోతే తెలంగాణలో చదువుకున్నవారు ఏపీలో నాన్‌లోకల్ అవుతారన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏపీ ఆర్థికలోటును భర్తీ చేయకపోతే 2019లోనూ ఆర్థికలోటులోనే ఉంటుదన్నారు..
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.