భయం వీడింది.. ఆనందంగా ఉంది!
హైదరాబాద్‌ను వదిలి వెళ్లాలంటే ముందు భయపడిన ఉద్యోగులు అక్కడి పరిస్థితులును చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందు రాము రామంటూనే బలవంతంగా వెళ్లిన సచివాలయ ఉద్యోగులు సొంతింటికి వచ్చినట్లు ఉందంటున్నారు. తమలో ఉన్న భయం పోయిందని, వసతులు చూసి ఆనందంగా ఉందంటున్నారు. కాగా గడిచిన కొద్దిరోజులుగా పలు శాఖలకు చెందిన ఉద్యోగులు ఏపీకి వెళ్లగా.. ఈ రోజు(సోమవారం) దాదాపు డజన్ కు పైనే శాఖలు ఏపీలో తమ కార్యకలాపాలు స్టార్ట్ చేశాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగుల్ని సాదరంగా ఆహ్వానించటం.. మిఠాయిలు తినిపించటం.. అభినందనలు తెలపటంతో ఉద్యోగులంతా సంతోషంగా గడిపారు. ఇదిలా ఉంటే.. ఏ శాఖకు ఆ శాఖ తమ ఉద్యోగులకు సంబంధించి వసతి సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించటం.. వారికి బస.. భోజనాలకు సంబంధించి ఒక వారం పాటు అంతా ఉచితమేనని చెప్పటం వారిని మరింత ఆనందానికి గురి చేస్తుంది.
ఇక.. వివిధ శాఖలకు సంబంధించి ఏర్పాటు చేసిన భవనాల్లోని వసతులన్నీ బాగుండటంతో హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రతి ఉద్యోగి సంతోషానికి గురి కావటమేకాదు..తమ సొంతింటికి వచ్చినట్లుగా ఉందని చెప్పటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. హైదరాబాద్ నుంచి తరలి వెళ్లిన ఉద్యోగుల్లో ఎవరూ అసంతృప్తికి లోనుకాకపోవటం.. ఏపీ రాజధానిలో సందడి వాతావరణంతో ఇప్పుడంతా హ్యాపీ మూడ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.