కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంపై గవర్నర్ క్లారిటీ..
ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఆదివారం ఉదయం 9 గంటల 22 నిమిషాలకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు.తిరుమల శ్రీవారి దర్శనార్ధం ఆయన సతీసమేతంగా తిరుమల వచ్చారు.ఇక ఆయనకు ఆలయ మహాద్వారం దగ్గర పూజారులు ఘన స్వాగతం పలికారు. మహాలఘు దర్శనంలో స్వామివారిని దర్శించుకుని తరించారు.
తనకు పదేళ్ల పదవీకాలం ఎంతో సంతృప్తిగా అనిపించిందని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉందన్నారు. ఇద్దరు సీఎంలు పోటీపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఉన్న కొద్దిపాటి సమస్యలు త్వరలోనే సమసిపోతాయని అన్నారు. త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల కమిటీతో సమావేశం కానున్నామని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.