Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

AP Government Good News For Unemployees

By   /  December 7, 2017  /  Comments Off on AP Government Good News For Unemployees

    Print       Email

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త..!

 

Suvidha
Biryani Pot

 

 

ప్ర‌భుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఆశిస్తోన్న అభ్య‌ర్థుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్‌ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో భారీగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ మేరకు సచివాలయంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఇందుకోసం డిసెంబర్‌ 26 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు.

పాఠ‌శాల‌లు ప్రారంభం అయ్యే నాటికి నోటిఫికేష‌న్ నుంచి ప‌రీక్ష, వెరిఫికేష‌న్, అపాయింట్ మెంట్ లెట‌ర్ అందుకోవ‌డం వ‌ర‌కు అన్ని ప్ర‌క్రియ‌లు పూర్తవుతాయ‌ని పేర్కొన్నారు. ఈ నెల 15న సిలబస్‌, నోటిఫికేషన్‌ను విడుదల చేసి… మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 45 రోజుల పాటు అప్లికేషన్‌కు గడువు ఉంటుందని వెల్లడించారు. మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 2018 జూన్‌ 12 నాటికి ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Nation mourns the death of the former Prime Minister Atal Bihari Vajpayee

Read More →