బాబుకు పదవీగండం ఉందా?
కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధాన ఘాట్లు అన్నీ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దింది. ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు పుష్కరాల ఏర్పాట్లకంటే కూడా చంద్రబాబు పదవీ గండంపై ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఒకడుగు ముందుకేసీ బాబు పదవి పోవడం ఖాయమని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంతకీ విషయమేమిటంటే… అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన రాజకీయ ప్రముఖులకు పదవి పోయిన ఉదంతాలు ఉన్న నేపథ్యంలో ఈ గుడిపై ఫోకస్ ఎక్కువగా పడింది తద్వారా చంద్రబాబు ఇక్కడికి రానుండటంపై ఆసక్తి నెలకొంది. పుష్కరాలు వివిధ పర్యటనల సందర్భంగా గతంలో మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్, మాజీ సీఎంలు మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అమరావతికి వచ్చారు. అయితే ఈ దేవాలయం దర్శనం అనంతరం వారు పదవి కోల్పోయారనే ప్రచారం ఉంది. ఇదిలా ఉండగా 2004లో కృష్ణా పుష్కరాలు 2006లో బౌద్ధ ఆచారం ప్రకారం నిర్వహించిన కాలచక్ర మహాసభల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్థిక మంత్రి కే రోశయ్య అమరావతికి వచ్చారు. అయితే కేవలం పుష్కర ఘాట్ సందర్శించి వెళ్లారు.
2006లో కాలచక్ర మహాసభలో పాల్గొన్నారు. పలుమార్లు అమరావతిలో వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్నా ఆలయానికి మాత్రం వెళ్లలేదు. ఇదిలాఉండగా వైఎస్ తరువాతి ముఖ్యమంత్రులు అయిన రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డిలు వివిధ పర్యటనల సందర్భంగా అమరావతి ప్రాంతానికి వచ్చినా దేవాలయాన్ని సందర్శించుకోలేదు. దీంతో ప్రస్తుతం చంద్రబాబు ఏం చేయనున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరఘాట్‌కు వెళతారా అనే విషయంలో సందిగ్దత నెలకొంది. అమరావతికి వస్తే ఘాట్లు మాత్రమే సందర్శించి వెళతారని కొందరు అంటుండగా…దేవాలయానికి కూడా సందర్శించుకుంటారని మరికొందరు పేర్కొంటున్నారు.కాగా ఇప్పటి వరకు దేవాలాయానికి వెళ్లిన వారికి పదవి గండం జరిగిందని, బాబుకు కూడా అలాగే జరిగే అవకాశాలుఎక్కువగా ఉంటాయని మరికొంతమంది అంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.