ఏపీ సర్కార్ వ్యూహం ఏంటి?
కాపులను బీసీల్లో చేర్చాలంటూ కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తునిలో చేపట్టిన కాపు గర్జన హింసాత్మకంగ మారిన సంగతి తెలిసిందే. కాపు గర్జన సభలో రైలు రోకో చేయాలని ముద్రగడ పిలుపు నిచ్చిన నేపథ్యంలో అప్పుడు వచ్చిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ను నిలబెట్టి ఆందోళన కారులు కొన్నిబోగీలను తగులపెట్టడం.. పోలీస్ స్టేషన్లను కూడా తగులపెట్టడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి కూడా తెలిసిందే. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కాపులను బీసీల్లో చేర్చే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం అందరినీ కలుపుకొని పోయి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ప్రభుత్వం కూడా రైలు దహనం కేసులో కదలిక తీసుకువచ్చింది. ఘటనలో పాల్గొన్నకొందరిని గుర్తించిన అరెస్టులు మొదలుపెట్టింది. ఇప్పటికి సుమారుగా 50 మందిని అరెస్ట్ చేసింది. అరె స్టు చేసిన వారిని పోలీసులు గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల కోర్టుల్లో ప్రవేశ పెడుతు న్నారు. ఈ నేపధ్యంలోనే నిందుతుల ముసుగులో అమాయకులను కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు ఆరోపణలు మొదలయ్యాయి. ఇవే ఆరోపణలతో ముద్రగడ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమాయకులను అరెస్ట్లు ఎందుకు చేస్తారు.. ఆ సంగటనకు తానే కారణం ముందు తనను అరెస్ట్చేయండి అంటూ అమలా పురంలోని పోలీసు స్టేషన్ ముందు కూర్చున్నారు. ఈ విషయం తెలియగానే ఉభయ జిల్లాల వ్యాప్తంగా ఉద్రిక్తత మొదలైంది. పోలీసుస్టేసన్ ముందు ముద్రగడ కూర్చోగానే ఆయన అనుచరులు, కాపు నేతలు పలువురు పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి ముద్రగడకు మద్దతుగా నిలవటంతో పరిస్దితులు ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసాయి. దాంతో ముద్ర గడను అమలాపురం నుండి ముద్రగడ స్వస్ధలమైన కిర్లంపూడికి తరలించారు.
ఆయనున్న ఆయన ఇంటిలోనే ఉంచాలన్న పోలీసుల ఆలోచనను గ్రహించిన ముద్రగడ కిర్లంపూడి చేరుకున్న తర్వాత పోలీసు వ్యాన్ నుండి దిగటానికి నిరాకరించారు. అరెస్టులు చేసిన అమాయకులను విడుదల చేసేంత వరకూ తాను వ్యానులో నుండి దిగేదిలేదని ముద్రగడ తేల్చి చెప్పటమే కాకుండా వ్యాన్ తలుపులు బిగించుకుని లోపలే కూర్చున్నారు. దాంతో ప్రభుత్వానికి ఏమి చేయాలో తోచటం లేదు.ఇదిలా ఉంటే ఆ రోజు జరిగిన విధ్వాంసానికి కారణం ఉభయ గోదావరి జిల్లా వాళ్లు కాదని, పులివెందుల వాళ్లు అని, ప్రతిపక్షనేత వైయస్ జగన్ పంపిన మనుషులని ముఖ్యమంత్రి చంద్ర బాబునాయడు, మంత్రులు అందరూముక్త కంఠంతోచెప్పి ఇప్పుడు ఉభయగోదావరికి చెందిన కాపులనే అరెస్ట్ చేయడం వెనుక సర్కార్ వ్యూహం ఏంటో అర్థం కావడం లేదు. దీనిపై ముద్రగడ స్పందిస్తూ కాపు ఉద్యమాన్ని ఆపాలని చూస్తే చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.