తనను ఎదుర్కొనలేకే.. తన కుమారుడిని టార్గెట్ చేశారు: మంత్రి రావెల
రాజకీయంగా తనను ఎదుర్కోనే దమ్ములేక.. కొందరు తన కుమారుడిని టార్గెట్ చేసుకుంటున్నారని ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు అన్నారు. ఎలాగైన తన కుమారుడిని లేనిపోని కేసుల్లో ఇరికించాలని వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు గుప్పించారు. ఓ దళిత విద్యార్థి జీవితంతో ఆడుకునే నీచ రాజకీయాలు చేస్తున్నారని అని అన్నారు.తన కుమారుడు ఎటువంటి తప్పూ చేయలేదని చెప్పుకొచ్చారు. చట్టం, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు. తన కుమారుడు నిర్దోషిగా బయటకు వస్తాడన్నారు.
ఏపీని చంద్రబాబు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న తమను జగన్ లక్ష్యంగా చేసుకున్నారని మంత్రి రావెల ఆరోపించారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. జగన్ నియంతృత్వ ధోరణితోనే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వలసపోతున్నారని విమర్శించారు. అందులో భాగంగానే టీడీపీలోకి వస్తున్నారన్నారు. సర్కారుపై జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయన ఆయోమయస్థితిలో ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్కు తమను విమర్శించే నైతికహక్కు లేదన్నారు. పేదలకు చెందాల్సిన సంపద అంతా దోచుకుని దాచుకున్నది ఎవరో అందరికీ తెలుసన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి చర్యలను నమ్మే స్థితిలో జనం లేరని మంత్రి అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.