Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP Politics: Hari Babu’s bold statement and critics on Suresh Prabhu

By   /  June 2, 2016  /  Comments Off on AP Politics: Hari Babu’s bold statement and critics on Suresh Prabhu

    Print       Email

hari babuఅదేం లెక్క హ‌రిబాబూ?

 

InCorpTaxAct
Suvidha

 

 

విశాఖ‌ప‌ట్నం ఎంపీ, బీజేపీ నేత హ‌రిబాబు మాట తూలాడో.. కావాల‌ని అన్నాడో తెలియ‌దు కానీ కొన్ని ఘాటువ్యాఖ్య‌లు చేశారు. ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు తెలుగుదేశం పార్టీ త‌ర‌పున మూడో అభ్య‌ర్థిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్ర‌భు నామినేష‌న్ వేయ‌డంతో ఇక విశాఖ‌కు రైల్వే జోన్ వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకుంటున్న త‌రుణంలో సురేశ్ ప్రభును రాజ్యసభ సీటు కేటాయించటానికి విశాఖకు రైల్వే జోన్ కు సంబంధం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఏపీ నుంచి రాజ్యసభకు సురేశ్ ప్రభు వెళుతున్నంత మాత్రాన విశాఖకు రైల్వే జోన్ రాదంటూ హరిబాబు చెబుతూ.. తన పదవీ కాలం ముగిసే లోపు విశాఖకు రైల్వే జోన్ వస్తుందని మ‌రోమాట అన్నారు. హరిబాబు మాటలు చూస్తుంటే.. విశాఖ జోన్ వ్యవహారం మొత్తం తన ఖాతాలో వేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

రేపొద్దున విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తే అదంతా సురేశ్ ప్రభుకు.. ఆయనకు సీటు కేటాయించిన టీడీపీకి ఎక్కడ వెళుతుందో అన్న భావన హరిబాబు మాటల్లో కనిపిస్తోంద‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే సురేష్ ప్ర‌భు విశాఖ‌కు రైల్వే జోన్ ప్ర‌క‌టిస్తే ఆ క్రెడిట్ అంతా త‌మ‌దే అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాల‌ని చూడ‌డం గ‌మ‌నార్హం. ఏది ఏమైనా వాళ్ల వ్య‌క్తి రాజ‌కీయాల కోసం ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళానికి గురిచేయ‌డం స‌మంజ‌సం కాదు. రైల్వే జోన్ వ‌స్తే వేరే వాళ్ల‌కు క్రెడిట్ ఎక్క‌డ వ‌స్తుందోన‌ని దాన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం కూడా మంచిది కాదు.  రైల్వే జోన్ ఎవ‌రు సాధించినా అది రాష్ట్ర అభివృద్ధిలో భాగ‌మేన‌ని గుర్తు పెట్టుకుంటే మంచిద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →