Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP Special status

By   /  August 8, 2016  /  Comments Off on AP Special status

    Print       Email

arun-jaitley_650x400_81469719658ఏపీకి రూ.10 వేల కోట్లు ప్యాకేజీ?

 

InCorpTaxAct
Suvidha

 

 

భార‌తీయ జ‌న‌తా పార్టీ పున‌రాలోచ‌న‌లో ప‌డిందా? ప‌్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల దాడికి భ‌య‌ప‌డిందా? ఏపీ ప్ర‌జ‌ల‌ను శాంతింప‌చేయాల‌ని ఆలోచిస్తోందా? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఏపీ ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చేందుకు ప్ర‌త్యేక ప్యాకేజీతో కేంద్రం ముందుకు వ‌స్తోంద‌ని వారంటున్నారు. కాగా ప్యాకేజీ ఎలా ఉండాలన్న అంశంలో కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు చెబుతున్నారు.  ఈ కసరత్తు పూర్తయితే ప్యాకేజీలో ఏఏ అంశాలుంటాయన్నది కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తార‌ని కూడా అంటున్నారు. ఏడాదికి రూ.10 వేల కోట్ల చొప్పున మూడేళ్ల పాటు ప్యాకేజీ ఇస్తారని ఎన్డీయే వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే… ఈ ప్యాకేజీలో కొత్తగా వచ్చేదాని కంటే కేంద్రం నుంచి మనకు రావాల్సినవే వస్తాయని తెలుస్తోంది. విభజనతో నష్టపోయిన రాష్ట్రం రెవెన్యూ లోటులో కూరుకుపోయింది.  దీన్ని కేంద్రం భర్తీ చేయాల్సి ఉంది. 2014-15కి సంబంధించి ఇంకా 16 వేల కోట్ల లోటును కేంద్రం ఇంకా భర్తీ చేయాలి. అయితే.. ఆ లెక్కలుఈ లెక్కలు వేసి కేంద్రం దాన్ని 8400 కోట్లుగానే చెబుతోంది.

దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయం.. రాజధాని నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధులు.. వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాకు ఇవ్వాల్సింది అన్నీ దీనిపరిధిలోకే వచ్చేలా లెక్క‌క‌ట్టి చిట్టా తయారవుతున్నట్లు సమాచారం. దీనిపై కేంద్రం స్పష్టత ఇస్తే కానీ ఏం జరగబోతోందో తెలియదు. ఇదిలా ఉంటే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా మొద‌టి నుంచి ప్ర‌త్యేక హోదాకంటే ప్యాకేజీకే మొగ్గు చూపుతుండ‌డంతో ఏపీ నుంచి కూడా పెద్ద‌గా వ్య‌తిరేక‌త ఉండ‌క‌పోవ‌చ్చు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →