Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP Special Status – Babu Sad

By   /  July 30, 2016  /  Comments Off on AP Special Status – Babu Sad

    Print       Email

RamaK AP staff opposes edited copyఏపీకి మ‌రోసారి అన్యాయం

 

InCorpTaxAct
Suvidha

రాజ్య‌స‌భ సాక్షిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మ‌రోసారి అన్యాయం జ‌రిగింది. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పిన బీజేపీ హోదా ఇవ్వ‌కుండా మాట మార్చేసింది. దీనిపై ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌కు న్యాయం చేసే విషయంలో నాటకం ఆడే పరిస్థితికి వచ్చారని మండిప‌డ్డారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో చేసిన ప్రకటన తనకెంతో బాధ కలిగించిందని చంద్రబాబు నాయుడు చెప్పారు. బాబు శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ‘రాష్ట్ర విభజన సమయంలో నేను ఒక్కటే కోరాను. రాష్ట్ర విభజన చేయాలంటే ఆంధ్ర ప్రదేశ్‌ను నమ్మకంలోకి తీసుకుని న్యాయం చేయండి. న్యాయం చేసిన తరువాత విభజన చేయండి. ఏది చేయాలన్నా ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ఓ ఫార్ములా చేసి ఏకాభిప్రాయం సాధించి విభజించమని చెప్పాను’ అని స్పష్టం చేశారు.  రాజ్యసభలో జరిగింది చూసిన తరువాత ఎంతో ఆవేదనకు గురయ్యానని బాబు అన్నారు.

ఇచ్చిన హామీలో ప్రత్యేక హోదా కూడా భాగమైనప్పుడు ఆర్థిక సంఘంతో సంబంధమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదని, అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లే ఇచ్చారని ఆయన అన్నారు.విభజన జరిగిన విధా నాన్ని ఆ రోజే తాను తప్పుపట్టానని ఆయన చెప్పారు. ‘విభజన జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకూ ఏ దినమూ ఆనందంగా లేము, ఒక పీడ కలగా మిగిలిపోయింది. తలచుకుంటే భయమేస్తున్నది’ అని బాబు చెప్పారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మరోసారి బయటపడ్డాయని సిఎం అన్నారు. తొందరపడితే సమస్యలు పరిష్కారం కావన్న ఉద్దేశంతోనే రెండేళ్లు ఓపికగా ఉన్నామని ఆయన చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను కేంద్రం గుర్తించాలని చంద్రబాబు సూచించారు. ప్రత్యేక హోదాపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరి కాదని, ప్రజల నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆయన అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →