Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP Special Status bill in Parliament

By   /  July 27, 2016  /  Comments Off on AP Special Status bill in Parliament

    Print       Email

parliament-kTNE--621x414@LiveMint`ప్ర‌త్యేక‌` చ‌ర్చ‌కు స‌సేమిరా

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ ప్ర‌వేశ‌పెట్టిన ప్రైవేట్ బిల్లు రాజ్య‌స‌భ‌లో రోజుకో మ‌లుపు తిరుగుతోంది. అస‌లు బిల్లును చ‌ర్చ‌కే రానివ్వ‌కుండా భార‌తీయ జ‌న‌తాపార్టీ అడ్డుకుంటుంటే.. ఏపీ ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించాల‌ని కాంగ్రెస్ డిమాండ్‌చేస్తోంది. రాజ్య‌స‌భ‌లో మంగ‌ళ‌వారం కూడా  కాంగ్రెస్ పార్టీ మళ్లీ పట్టుబట్టింది. దీంతో పోడియంను చుట్టుముట్టిన కాంగ్రెస్ నేతలు నినాదాలతో రాజ్యసభను హోరెత్తించారు. ఈ సందర్భంగా ఇది రాజ్యసభ రూల్స్ కు విరుద్ధమని చెప్పిన డిప్యూటీ ఛైర్మన్ కురియన్, ఈ శుక్రవారం చర్చకు తీసుకువద్దామని అన్నారు. దానికి అంగీకరించని కాంగ్రెస్ నేతలు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా కురియన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి మధ్య ఆసక్తికర వాదన చోటుచేసుకుంది. ఈ సమస్య పరిష్కారానికి ఆందోళన విధానం కాదని అన్నారు. వచ్చే శుక్రవారం దీనిపై చర్చ, ఓటింగ్ పెడదామని అన్నారు.

దీనిపై సీతారాం ఏచూరి మాట్లాడుతూ, సమస్యను పరిష్కరించాలని అనుకుంటే ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలని కోరారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తున్నట్టు గతంలో ప్రధాని ఇక్కడే ప్రకటించారని, దానిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని, ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ ప్రకటిస్తే సమస్య పరిష్కారమవుతుందని, అధికార పార్టీని అందుకు ఆదేశించాలని ఆయన సూచించారు. రూల్స్ ప్రకారం ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరగలేదని, అందుకే ప్రస్తుతం ఈ ఆందోళన అని ఆయన చెప్పా రు. దీంతో కాంగ్రెస్ నేతలు మళ్లీ నినాదాలు ప్రారంభించారు. డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, బిల్లును వచ్చే శుక్రవారం చేపడతామని పదేపదే చెబుతున్న వేళ, కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సర్దుకుంటామని, వచ్చే శుక్రవారం బిల్లును చేపట్టి తప్పనిసరిగా ఓటింగ్ నిర్వహిస్తామన్న హామీని మీరు ఇస్తారా? అంటూ డిప్యూటీ చైర్మన్‌ను సూటిగా ప్రశ్నించారు. అయితే, దీనికి కురియన్ సమాధానం చెప్పకపో వడం గమనార్హం.

ఇదిలా ఉంటే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యుడు విజయసాయిరెడ్డి మాట్లా డుతూ, బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఏపీలో ప్రధాన ప్రతిపక్షా నికి చెందిన సభ్యుడిగా ఉన్న తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. అవకాశం ఇస్తానని కురియన్ హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు మెంబర్ బిల్లును నిబంధనలకు విరు ద్ధంగా శుక్రవారం మినహా మరో రోజు చర్చించలేమని కురియన్ స్పష్టం చేయగా, మరోసారి కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసు కెళ్లి నినాదాలతో హోరెత్తించారు. కాగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా బిల్లు ద్రవ్య బిల్లు అని, దీనిని లోక్ సభలో ప్రవేశపెట్టాలి తప్ప రాజ్యసభకు చర్చించే అధికారం లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఇది రాజ్యాంగంలో ఉందని, ఏపీకి ప్రత్యేక హోదా బిల్లు ద్రవ్యబిల్లు అని ఆయన స్పష్టం చేశారు.

దీంతో ద్రవ్య బిల్లుపై చర్చించేందుకు రాజ్యసభకు అధికారం లేదని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ తెలిపారు. దీనిపై కమ్యూనిస్టు ఎంపీ సీతారాం ఏచూరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ సభను తప్పుదోవపట్టిస్తున్నారని, ప్రైవేట్ మెంబర్ బిల్లును మనీ బిల్లుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా భార తీయ జనతాపార్టీ సభ్యులపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామ చందర్రావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వ‌డం విశేషం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →