Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP Special Status discussion scheduled to happen in Rajya Sabha today

By   /  August 5, 2016  /  Comments Off on AP Special Status discussion scheduled to happen in Rajya Sabha today

    Print       Email

హోదాపై ఉత్కంఠ

335655-334437-parliamentప్రత్యేకహోదా అంశంపై అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. నేడు రాజ్య సభలో ఏపికి ప్రత్యేకహోదా అంశంపై చర్చ జరుగనున్నది. చర్చ తర్వాత ఓటింగ్ ఉంటుందా? ఉండదా? అన్న విషయం పైనే ఇపుడు సర్వాత్రా ఉత్కంఠం మొదలైంది. శుక్రవారం నాడు రాజ్యసభలో చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ సీరియస్‌గా దృష్టిపెట్టాయి. గడచిన పదిరోజులుగా ప్రత్యేకహోదాపై రాజ్యస భలోను, లోక్‌సభలోను అనేక ఆందోళనలకు, నిరసనలకు హోదా బిల్లే కేంద్ర బిందువుగా మారిన సంగతి అందరికీ తెలి సిందే. కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుతోనే రాష్ట్రంలో రాజకీయం బాగా వేడెక్కింది. గతంలోనే కేవీపీ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ రాజ్యసభలో బిల్లు అసలు చర్చ దాకానే రాకుండా అధికార భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే, కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై ఆగష్టు 5వ తేదీన చర్చ, ఓటింగ్ జరుగుతుందంటూ అప్పట్లో బిల్లును వాయిదా వేస్తూ రాజ్యసభ వైస్ ఛైర్మన్ పిజె కురియన్ ప్రకటించారు.

InCorpTaxAct
Suvidha

ఆ తర్వాత అనేక పరిమాణాల మధ్య పోయిన నెల చివరి వారంలో ఇదే బిల్లును లఘు చర్చ క్రింద చర్చకు రాజ్యసభలో అనుమతిం చారు. ఆ సందర్భంగానే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాల వ్యూహాలు, ఒక పార్టీపై మరొక పార్టీ పై చేయి సాధించేందుకు ఎత్తుకుపై ఎత్తులువేసుకున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రం లో రాజకీయం బాగా వేడందుకున్నది. లఘుచర్చలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ సమాధానమిస్తూ ప్రత్యేకహోదా బిల్లుపై చర్చ జరగటం మినహా ఓటింగ్‌కు అవకాశం లేదని తేల్చేశారు. సదరు బిల్లు ద్రవ్య సంబంధిత బిల్లు కాబట్టి రాజ్యసభలో ఓటింగ్ జరగదన్నారు. అయితే, అందుకు ప్రతిపక్షాలేవీ అంగీకరించలేదు.

ప్రత్యేకహోదా బిల్లు ఏ విధంగా చూసినా ద్రవ్య సంబంధిత బిల్లు కాదని ప్రతిపక్షాలన్నీ తేల్చిచెప్పాయి. బిల్లుకు మద్దతుగా మాట్లాడిన జాతీయ పార్టీల్లో ఎన్‌డిఏలోని బీజేపీ మిత్రపక్షాలు కూడా ఉండటంతో కేంద్రప్రభుత్వం నివ్వెరపోయింది. ఒకవిధంగా బీజేపీ రాజ్యసభలో ప్రత్యేకహోదా అంశంపై ఒంటరిగా మిగిలిపోయింది. దాంతో ఏమి చేయాలో బీజేపీకి పాలుపోవటం లేదు. లఘు చర్చలోనే ప్రైవేటుమెంబర్ బిల్లుకు అంత భారీ ఎత్తున జాతీయ పార్టీలన్నీ మద్దతు తెలిపినపుడు శుక్రవారం నాడు చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ కూడా జరిగితే తమ పరిస్దితి ఏమిటని కమలనాధుల్లో ఆందోళన పెరిగిపోయింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →