Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP special status is still a mirage

By   /  September 8, 2016  /  Comments Off on AP special status is still a mirage

    Print       Email

433603-arun-jaitley-3-ptiఊరించి.. ఉసూరుమ‌నిపించి!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మ‌రోసారి అన్యాయం జ‌రిగింది. మోడీ స‌ర్కార్ ఎన్నిక‌ల హామీల్లో పేర్కొన్న ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క పోగా.. హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి మోసం చేసింది. తాజాగా ఎక్స్‌ట‌ర్న‌ల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు (ఈఏపీ) అంటే హోదా ఉంటేఎలాంటివి వ‌చ్చేవో ఆ విధంగా ఈఏపీ కింద ఇస్తామ‌ని కంటితుడుపు మాట‌లు మాట్లాడుతోంది.  పైగా చట్టబద్ధంగా అమలుకావాల్సిన రైల్వేజోన్ గానీ, కడప స్టీలు ప్లాంటు గానీ, దుగ్గ‌రాజ‌ప‌ట్నం నైకాశ్ర‌యం కానీ ఉంటుంద‌న్న భ‌రోసా ఇవ్వ‌లేదు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఎప్పుడెప్పుడు ప్రకటన వస్తుందా అని ఎదురుచూసిన ప్రజలకు రాత్రి 10.47 గంటలకు జైట్లీ చేసిన ప్రకటన ఊరించి ఉసూరుమ‌నిపించిన‌ట్లు అయింది. ఆర్థిక శాఖ రూపొందించిన సాయం ప్రకటనను సీఎంకు పంపించి ఆయన సమ్మతించిన తరువాతే టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనాచౌదరితో కలిసి అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు ఈ ప్ర‌క‌ట‌న చేశార‌ని వార్త‌లు విన‌వ‌స్తున్నాయి.

కాగా అరుణ్ జైట్లీ చేసిన ప్ర‌క‌ట‌న సారాంశం ఇలా ఉంది. ‘పార్లమెంటు సమావేశాల అనంతరం గత కొద్ది రోజులు కేంద్రం నూతన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పలు అంశాలను పరిశీలన చేస్తూ వచ్చింది. ఏపీకి కేంద్ర సాయం అందించేందుకు 4 అంశాలు దోహదపడుతున్నాయి. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 14వ ఆర్థిక సంఘం ద్వారా రెవెన్యూ లోటు భర్తీ, విభజన రోజున ప్రధాని  ఇచ్చిన  హామీలు, నీతి ఆయోగ్ చేసిన సిఫారసులు.. ఈ 4 రూపాల్లో ఏపీకి సాయం దక్కుతుంది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో చేసిన హామీలన్నింటినీ  అమలుచేస్తామని కేంద్రం  చెప్పింది. వాటన్నింటికీ కట్టుబడి ఉన్నాం. తొలి ఏడాది రెవెన్యూ లోటు భర్తీకి రూ. 3975 కోట్లు ఇచ్చాం. మిగిలిన మొత్తాన్ని  ఇస్తాం. అలాగే రాజధాని నిర్మాణానికి రూ. 2500 కోట్లు ఇచ్చాం. వెనకబడిన ప్రాంతాలకు రూ. 1050 కోట్లు ఇచ్చాం. జాతీయ స్థాయి సంస్థలు నెలకొల్పాం.  మంజూరు చేయాల్సిన వాటికి సంబంధించి కార్యచరణ జరుగుతోంది. వీటి ఏర్పాటుకు  క ట్టుబడి ఉన్నాం..’ అని అన్నారు. కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు మాట్లాడుతూ  ఏపీని ప్ర‌త్యేక రాష్ట్రంగా ప‌రిగ‌ణించి కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుంద‌న్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అనేక ప్రాజెక్టులు, విద్యాసంస్థలు మంజూరు అయ్యాయ‌ని,  మిగిలిన గిరిజన వర్సిటీ, కడప స్టీల్ ప్లాంట్ వీటి ఏర్పాటుపై కూడా ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియ‌మించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఏపీకి కేంద్రం సాయం చేయ‌డ‌మ‌నేది నిరంత‌ర ప్ర‌క్రియ అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →