Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP Special Status?

By   /  May 13, 2016  /  Comments Off on AP Special Status?

    Print       Email

special statusర‌గిలిన `ప్ర‌త్యేక‌` జ్వాల‌

 

InCorpTaxAct
Suvidha

 

 

న‌మ్మి ఓట్లు వేసిన పాల‌కులు మోసం చేశారు. మాట ఇచ్చి తూచ్ అన్నారు. అధికారం వ‌చ్చే వ‌ర‌కు ఒక మాట‌.. అధికారంలోకి వ‌చ్చిన మ‌రొక మాట మాట్లాడుతూ పాల‌కులు అంటే ఇలాగే ఉంటారంటూ నిరూపిస్తున్నారు. అయితే గ‌తంలో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కూడా అధికారంలో ఉన్న నేత‌లు ద‌శాబ్దాల త‌ర‌బ‌డి తెలంగాణ ఇవ్వ‌కుండా మోసం చేస్తూ వ‌చ్చారో ఇప్పుడు ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను కూడా ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా మోసం చేస్తున్నారు. ఎన్నిక‌ల ముందు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని బీజేపీ, ఏపీకి 10 ఏళ్ల పాటు ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని టీడీపీ హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి రాగానే వాటిని మ‌రిచారు. మేనిఫెస్టోలో పేర్కొని కూడా ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌డం లేదు. కాగా మొద‌టి నుంచి ప్ర‌త్యేక హోదాపై ఉద్య‌మాలు చేస్తూ వ‌చ్చిన ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్పుడు కూడా అదేబాట‌లో న‌డుస్తున్నాడు. రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయంటూ ఆరోపిస్తూ.. ప్ర‌త్యేక హోదాను ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ ఉద్య‌మాలు.. ధ‌ర్నాలు.. ఆందోళ‌న‌లు చేప‌డుతున్నాయి.
అయితే జ‌గ‌న్ చేప‌ట్టే అన్ని దీక్ష‌లు.. ధ‌ర్నాలు.. ఆందోళ‌న‌ల‌కు జ‌నాలుతండోప తండాలుగా త‌ర‌లివ‌స్తున్నారు. మండుటెండ‌ల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా వ‌చ్చి సంఘీభావం తెలుపుతున్నారు. దీంతో ప్ర‌త్యేక హోదా కావాల‌నే కోరిక ప్ర‌జ‌ల్లో ఎంత బ‌లంగా ఉందో అర్థ‌మ‌వుతుంది. ఈ `ప్ర‌త్యేక‌` జ్వాల పెద్ద‌ది కాక‌ముందే కేంద్రం స్పందించి ఏపీ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తే బాగుంటుంద‌ని.. ఇవ్వ‌క‌పోతేమాత్రం అది ఏ స్థాయికి చేరుతుందో ఎవ‌రూ ఊహించ‌లేర‌ని రాజ‌కీయా విశ్లేష‌కులు అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →