రాష్ట్రాలే వేరే.. మిగతాదంతా సేం టు సేం!
తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పేరుకు మాత్రమై వేరైనా చాలా విషయాల్లో ఒక్కటిగానే ఉంటున్నాయి. రాష్ట్రాలను పాలిస్తున్న ముఖ్యమంత్రుల పేర్లు (చంద్రులు) దగ్గర నుంచి వాళ్లు చేసే పనులు వరకు ఇంచు మించు ఒక్కటిగానే ఉంటున్నాయి. చంద్రబాబు ఏది ప్రకటిస్తారో.. చంద్రశేఖర్‌రావు అదే చేస్తారు.. చంద్రశేఖర్ రావు ఏది చెబుతారు.. బాబు అదే ఆంధ్రప్రదేశ్‌లో చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఛండీయాగానికి చంద్రబాబును కేసీఆర్ ఆహ్వానిస్తే … అమరావతిలో నిర్మించే నూతన రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రశేఖర్‌రావును చంద్రబాబు ఆహ్వానించారు.
ఇద్దరూ ఒకేమాట..
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక విషయంలో ఒకే మాటపై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అదే చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని , ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పడంతో పాటు డాక్టర్ అంబ్కేదర్ జయంతి సందర్భంగా అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బాబు ప్రకటించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. హుస్సేన్ సాగర్‌లో ఏర్పాటు చేసిన బుద్ధుని విగ్రహం 58 అడుగులు ఉండగా, అంతకన్నా పెద్ద విగ్రహన్ని ఏర్పాటు చేసేందుకు టీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలం అన్వేషణతో పాటు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం అధికారులను ఆదేశించడం గమనార్హం. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన అంబేదర్క్ విగ్రహం కానుంది. బ్రెజిల్‑లోని రియో డి జెనీరో నగరంలో క్రైస్ట్ ద రెడీమర్ విగ్రహం ఎత్తు సరిగ్గా 125 అడుగులు. అంటే దాదాపు అదే స్థాయిలో అంబేద్కర్ విగ్రహం రెండు రాష్ట్రాల్లో ఉంటుందన్న మాట.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.