Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

APPSC Jobs 2016 latest Andhra Pradesh Groups notification

By   /  August 19, 2016  /  Comments Off on APPSC Jobs 2016 latest Andhra Pradesh Groups notification

    Print       Email

Andhra Pradeshఎట్ట‌కేల‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చింది

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల ఫ‌లిత‌మో.. స‌ర్కార్ ఏర్ప‌డి రెండున్న‌ర ఏళ్లు దాటుతోంద‌న్న ఆందోళ‌న తెలియ‌దు కానీ.. మొత్తానికి ఏపీ స‌ర్కార్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) తొలి నోటిఫికేష‌న్ జారీ చేసింది.  ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని, నిరుద్యోగుల‌కు ఉద్యోగం వ‌చ్చే వ‌ర‌కు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తాన‌ని చెప్పిన బాబు అధికారంలోకి రెండేళ్లుఅవుతున్నా ఒక్క నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల చేయ‌లేద‌ని నిత్యం ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఏపీలోని ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెబుతూ ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు.  వివిధ శాఖ‌ల్లో  748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ పొస్టుల భ‌ర్తీకి నొటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ పరీక్షకు హాజరు కాదలచుకున్న వారు సెప్టెంబ‌ర్ 21 వరకూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ లో పరీక్ష నిర్వహిస్తారు. తొలిసారి ఆన్ లైన్ లో ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించనుంది.

విభజన అనంతరం ఏపీ సర్కారు ఇఛ్చిన తొలి ఉద్యోగ నోటిఫికేషన్ ఇది. అయితే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు గతంలో ఓ నోటిఫికేషన్ వెలువడింది. రాబోయే రోజుల్లో మరిన్ని  నోటిఫికేషన్లు  జారీ కానున్నాయ‌ని స‌ర్కార్ పెద్ద‌లు అంటున్నారు.  త్వరలోనే గ్రూప్ 2పోస్టులతో పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. పది వేల ఉద్యోగాల భర్తీకి కొద్ది రోజుల క్రితమే ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ఏపీలో నిరుద్యోగులకు రాబోయే రోజుల్లో చేతినిండా పని ఉండ‌బోతోంద‌న్న‌మాట‌.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →