మరోసారి బయటపడ్డ పాక్ వంకర బుద్ధి..!
భారత్ ను అస్థిర పరిచేందుకు పాక్ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తాజాగా మరోసారి పాక్ వంకర బుద్ది బయటపడింది. ఉగ్రవాది బుర్హాన్ వనీని స్వాతంత్య్ర సమరయోధుడిగా పాక్కీర్తించింది. వనీ ఎన్ కౌంటర్ తర్వాత కశ్మీర్ లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్ల వెనుక పాక్ కుట్ర దాగిఉందని విషయంరుజువైంది.
జమ్ముకశ్మీర్లో గత నెల 25న భద్రతాదళాలు బహదూర్ అలీ అనే ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నాయి. అతను విచారణ సందర్భంగా పచ్చి నిజాలు వెల్లడించాడు. తనకు పాకిస్థానే శిక్షణ ఇచ్చిందని పేర్కొన్నాడు. భారత్ లో తాను ఏమేం చేయాలో ఎప్పటికప్పుడు పాక్ నుంచి ఆదేశాలు వచ్చేవన్నాడు. తనలాంటివారు పాక్ లో వందలాదిమంది శిక్షణ తీసుకుంటున్నారని వెల్లడించాడు. పాక్ ఆర్మీ కూడా తమ స్థావరాలను సందర్శిస్తూ ఉంటుందని తెలిపాడు. కశ్మీర్ లో మారణహోమం సృష్టించేందుకు లష్కరే తోయిబా వ్యూహం రచించిందని తెలిపాడు. తనకు భారత్ అన్నా.. ఇక్కడి ప్రజలు అన్నా అసలు ఇష్టం లేదన్నాడు. తాను భారతీయులను చంపేందుకే వచ్చానని విచారణ సందర్భంగా బహదూర్ అలీ వెల్లడించాడు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.