Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Arun Jaitley presents Union Budget 2016-17: ‘IT slabs remain unchanged’

By   /  February 29, 2016  /  Comments Off on Arun Jaitley presents Union Budget 2016-17: ‘IT slabs remain unchanged’

    Print       Email

arun jaitlya - parliament

2016-17 సాధారణ బడ్జెట్ ముఖ్యాంశాలు..
ప్రస్తుతం చాలా దేశాలు ఆర్ధికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇలాంటి సమయంలో తాను బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. పార్లమెంట్ లో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ సమాజం ఆర్ధికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత ఆర్ధిక వ్యవస్థ అత్యంత బలంగా ఉందన్నారు. తమ సర్కారు ఎదురైన సవాళ్ళను అవకాశాలుగా మార్చుకుని ముందుకెళుతోందని చెప్పారు. ద్రవ్యోల్బనం 9.6 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిందని తన ప్రసంగంలో చెప్పారు. భారత్‌ 7.6 శాతం వృద్ధిరేటు నమోదు చేసినట్లు జైట్లీ చెప్పారు.

InCorpTaxAct
Suvidha

అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో.. ప్రభుత్వం కొత్తగా తెస్తున్న ప్రధాని పంటల బీమా యోజన రైతులకు భరోసా ఇస్తుందని చెప్పారు. గ్రామీణ, కీలక రంగాలకు అదనపు వనరులు సమకూర్చామన్నారు. విదేశీ మారక నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయన్న ఆయన.. ఏడో వేతన సంఘం సిఫార్సులు, ఒకే ర్యాంకు ఒకే పింఛన్‌తో ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోందని తెలిపారు. గ్రామీణ, వ్యవసాయ, బ్యాంకింగ్‌ రంగాలకు ఆర్థిక దన్ను ఇస్తామని చెప్పారు. వచ్చే ఏడాదికి 9 సూత్రాల ఆధారంగా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జీఎస్‌టీ ఆమోదం, కాలం చెల్లిన చట్టాలపై దృష్టి సారించామని చెప్పారు. వ్యవసాయ రంగానికి 35, 984 కోట్లు కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి సించాయి యోజన ద్వారా అదనంగా 25లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

అలాగే ప్రభుత్వ బ్యాంకులను బలోపేతం చేస్తామని చెప్పారు. రానున్న 5 ఏళ్ళలో మౌలిక సదుపాయాలకు కేటాయింపులు పెంచుతామన్నారు. సాగునీటి కోసం రూ.86, 500 కోట్లు వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు .రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పప్పు ధాన్యాల అభివృద్ధికి రూ.500కోట్లు కేటాయింపులు చేసినట్లు చెప్పారు. గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, నైపుణ్యాలు, ఉపాధి, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఆర్థిక సంస్కరణలు, వ్యాపారానుకూల వాతావరణం, ఆర్థిక క్రమశిక్షణ, పన్ను సంస్కరణలపై దృష్టి సారిస్తామన్నారు.యూనిఫైడ్‌ అగ్రికల్చర్‌ ప్లాట్‌ఫామ్‌ను బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి రోజున జాతికి అంకితం చేస్తామన్నారు. రూ.17.9 లక్షల కోట్ల మేర వ్యవసాయ రుణాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తక్కువ ప్రీమియం.. అత్యధిక బీమా రక్షణతో ప్రధానమంత్రి ఫసలీ బీమా యోజన ఏర్పాటు చేశామన్నారు. జంతు ఆరోగ్య కార్డుల అందజేత, జంతువుల మార్కెటింగ్‌ను ఈ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానించడం జరుగుతుందన్నారు.

27వేల కోట్లతో 2.23 లక్షల కి.మీ. ల రహదారుల నిర్మాణం.. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజనకు రూ.19వేల కోట్లు కేటాయింపులు.. నాబార్డ్‌ ద్వారా రూ.20వేల కోట్లతో ఇరిగేషన్‌ ఫండ్‌ ఏర్పాటు.. 300 రూర్బన్‌ క్టస్లర్ల ఏర్పాటు.. గ్రామీణ విద్యుదీకరణకు పటిష్టమైన చర్యలు.. పశు పోషణకు కొత్తగా 4 పథకాలు అమలు.. స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కోసం రూ.9వేల కోట్లు కేటాయింపులు.. పంటల బీమా పథకం కోసం రూ.5,500 కోట్లు.. సేంద్రియ వ్యవసాయానికి రూ.412 కోట్లు వంటివి జైట్లీ బడ్జెట్ లోని ముఖ్యాంశాలు.

గ్రామీణాభివృద్ధికి పెద్ద ఎత్తున కేటాయింపులు..

గ్రామీణ, మున్సిపాల్టీలకు 2016-17 సాధారణ బడ్జెట్ రూ. 2.87లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఇంతకుముందుతో పోలిస్తే 228 శాతం మేర అధికంగా ఉందన్నారు. గ్రామాల్లో సదుపాయల కల్పన, పట్టణీకరణకు ఈ నిధులు వినియోగించనున్నారు. గ్రామీణ అభివృద్ధికి మాత్రమే రూ.87,765 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ విద్యుదీకరణకు సంబంధించిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకానికి రూ. 38,500 కోట్లు అందజేశామన్నారు. మే 2018నాటికి 100 శాతం గ్రామీణ విద్యుదీకరణను లక్ష్యంగా పెట్టుకున్నామని.. గ్రామీణ విద్యుదీకరణకు రూ.8500 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో డిజిటల్‌ విద్యావ్యాప్తి కింద వచ్చే మూడేళ్లలో 6కోట్ల గృహాలను డిజిటల్‌ లిట్రసీ స్కీం పరిధిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
యువతకు నైపుణ్యాల పెంపుపై దృష్టి..

కుటుంబానికి రూ.లక్ష మేర బీమా కల్పిస్తామన్నారు. వయో వృద్ధులకు రూ.30వేలు అదనంగా ఆరోగ్య బీమా ఉంటుందన్నారు. గ్రామాల్లోనూ డిజిటల్‌ అక్షరాస్యత పెంపునకు చర్యలు చేపట్టనున్నట్లు జైట్లీ వివరించారు. అంతేకాకుండా.. కొత్తగా 62 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉన్నత విద్యకు నిధులిచ్చేందుకు రూ.1000 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. దళితుల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన ద్వారా యువత నైపుణ్యాభివృద్ధికి రూ.1700 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు చెప్పారు. రానున్న మూడేళ్లలో కోటి మంది యువతకు నైపుణ్యాల పెంపుకు కృషి చేస్తామన్నారు. అన్నిరకాల నైపుణ్యాల శిక్షణకు దేశవ్యాప్తంగా 5700 పాఠశాలల ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త ఉద్యోగులకు మొదటి మూడేళ్లు 8.33 శాతం ఈపీఎఫ్‌ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. స్టార్టప్‌ ఇండియా స్టాండప్‌ ఇండియా కోసం రూ.500 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు చెప్పారు.

భారీగా మౌళిక రంగానికి కేటాయింపులు..

బడ్జెట్ లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేసామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మొత్తం రూ. 2,21,246 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రహదారులు, హైవేల నిర్మాణానికి రూ..55,000 కోట్లు కేటాయించారు. 10,000 కి.మీల జాతీయ రహదారుల అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 50,000 కి.మీల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేస్తామన్నారు. పీఎంజీఎస్‌వైతో కలుపుకొని మొత్తం రహదారులకు రూ.97,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దీంతో 85 శాతం నిలిచిపోయిన రోడ్డు ప్రాజెక్టులు మళ్లీ కదిలే అవకాశం ఉంటుందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →