సిద్దూకు ఎలాంటి కండీషన్లు పెట్టలేదు: కేజ్రీవాల్
ఆప్ లో బీజేపీ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ చేరబోతున్నారని తొలుత వార్తలు వచ్చాయి. అనంతరం సిద్దూ తన భార్యకు కూడా టిక్కెట్ ఇవ్వాలని కేజ్రీవాల్ ని కోరాడని న్యూస్ వినిపించింది. అయితే ఒక్క కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే టిక్కెట్ ఇస్తామని ఆప్ నేతలు సిద్దూకు స్పష్టం చేశారని ప్రచారం సాగింది. దీంతో సిద్దూ పునరాలోచనలో పడ్డారనే వార్తలు హల్ చల్ చేశాయి. చివరకు కేజ్రీవాల్.. సిద్దూను పక్కన పెట్టేశారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆప్ అధినేత కేజ్రీవాల్ ట్విట్టర్లో స్పందించారు. సిద్ధూ చేరికపై పార్టీ అభిప్రాయం ఏమిటో తెలియజేయడం తన బాధ్యతగా చెప్పారు. దీనికి కొంత సమయం పడుతుందన్నారు. ఈ మేరకు ట్వీట్టర్ లో తెలిపారు. అలాగే సిద్ధూ ఆలోచించుకునేందుకు కూడా కొంత సమయం అవసరం అవుతుందన్నారు.అయితే.. తాము సిద్ధూకి ఎలాంటి ముందస్తు షరతులు పెట్టలేదన్నారు. గతవారం సిద్ధూ తనను కలిశారని వెల్లడించారు. తనకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలన్నారని తెలిపారు. సిద్ధూ క్రికెట్ లెజెండ్ అని కేజ్రీవాల్ ప్రశంసించారు. ఆయన ఆప్‌లో చేరినా చేరకపోయినా ఆయనపై తమకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని పేర్కొన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.