అశ్విన్‌కు హగ్ ప్రశంసలు
క్రికెట్ ప్రపంచంలో స్విన్ అంటేనే గుర్తుకు వచ్చేది మొదటగా ఇండియా టీం. మొదటి నుంచి భారత జట్టులోని కొంతమంది బౌలర్లు స్పిన్‌తో రికార్డులు సృష్టించారు. గతంలో స్పిన్ మాంత్రికుడిగా పేరుపొందిన అనిల్‌కుంబ్లే 10 వికెట్లు తీసుకుని చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్కూడా 10 వికెట్లు తీయకపోయినా మంచి ప్రతిభతో అందరి ప్రశంసలందుకుంటున్నాడు. తాజాగా రవిచందన్ర్ అశ్విన్ అ త్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ అని కోల్క తా నైట్‌రైడర్స్ స్పిన్నర్ బ్రాడ్‌హగ్ ప్రశంసించాడు. 45 ఏళ్ల వయ సులోనూ ఐపీఎల్లో తన జట్టు తరఫున మంచి బౌలింగ్ ప్రదర్శ న చేస్తున్న హగ్… అశ్విన్‌కు తా ను పెద్ద అభిమానినని… అతడి బౌలింగ్ చాలా బాగుంటుందని కితాబిచ్చాడు. ప్రతి క్రికెటర్ కెరీర్ లో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని అశ్విన్‌తో మాట్లాడకుండా అతడి బౌలిం గ్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని హగ్ అన్నాడు. త్వరలోనే అతడు ఫామ్ లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. వికెట్లు తీసేందుకు అతడు చాలా కష్టపడతాడని అన్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోని కెప్టెన్సీలోని కొత్త జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అశ్విన్ 11 మ్యా చ్ల్లో 34 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. టెస్టుల్లో 871 రేటింగ్‌తో రెండో ర్యాంకులో ఉన్న అశ్విన్ 32 టెస్టుల్లో 25.39 సగటుతో 176 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్డ్ బ్రాడ్.. అశ్విన్ కన్నా ఒక్క పాయింట్ ఆధిక్యంతో నెంబర్.1 స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ మంచి ఫాంలోకి వచ్చి నం-1 స్థానానికి రావాలని ఆశిద్దాం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.