అశ్విన్..నంబర్ వన్
2015 ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తర్వాత కాలంలో ఆ స్థానాన్ని కోల్పోయి మళ్లీ నంబర్ వన్‌గా నిలిచారు. వెస్టిండీస్‌తో ఆంటిగ్వాలో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 83 పరుగులకు ఏడు వికెట్లు సాధించి భారత్ ఘన విజయంలో కీలపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌పై జరిగిన టెస్టులో పది వికెట్లు సాధించిన పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా అశ్విన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం సంపాదించాడు. అయితే ఓల్డ్ ట్రాఫర్డ్‌లో జరిగిన రెండో టెస్టులో యాసిర్ కేవలం ఒక్క వికెట్ సాధించడంతో అతను తిరిగి వెనకబడి పోయాడు. వెస్టిండీస్‌పై అద్భుత ప్రదర్శనతో అశ్విన్ అయిదు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలవగా, ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, ఓల్డ్‌ట్రాఫర్డ్‌లో పాకిస్తాన్‌పై 108 పరుగులకు ఏడు వికెట్లు సాధించిన ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ వోక్స్ ఏకంగా పది స్థానాలు ఎదిగి 23వ స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన ఉమేశ్ యాదవ్ 24వ స్థానానికి చేరుకోగా, మహమ్మద్ షమీ 28 స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్‌లో అంటిగ్వా టెస్టులో డబుల్ సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్ రెండు స్థానాలు ఎదిగి 12వ స్థానానికి చేరుకోగా, 84 పరుగులు చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్ నాలుగు స్థానాలు ఎగబాకాడు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.