Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Ashwin’s 4 for 8 gives India series; team retains No.1 ranking

By   /  February 15, 2016  /  Comments Off on Ashwin’s 4 for 8 gives India series; team retains No.1 ranking

    Print       Email

team india - new

టీమిండియాదే టీ20..!

InCorpTaxAct
Suvidha

 

శ్రీలంకతో జరిగిన టి-20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. 3 మ్యాచ్ ల టి 20 సిరీస్ ను 2-1 తేడాతో సాధించింది.మూడవ మ్యాచ్ డిసైడింగ్ మ్యాచ్ లా మారిన విషయం తెలిసిందే.ఈ మూడవ టి-20లో భారత్ అలవోకగా విజయం దక్కించుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దోని సేన లంకేయులను 82 పరుగులకే కుప్ప కూల్చింది. స్టార్ స్పిన్నర్ అశ్విన్ 4 వికెట్లు తీసి లంకను కష్టాల్లో పడేశాడు.తర్వాత 83 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 13.5 ఓవర్లలోనే కేవలం ఓ వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. టీమిండియా బ్యాట్స్ మెన్లలో ధావన్ 46 (నాటౌట్), రహానే (నాటౌట్), రోహిత్ 13 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రవి చంద్రన్ అశ్విన్ ఎంపిక చేశారు.

చెలరేగిన అశ్విన్..

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా శ్రీలంకకు చుక్కలు చూపించింది. బౌలర్ అశ్విన్ ధాటికి లంక బ్యాట్స్ మెన్స్ కుదేలయ్యారు. ఆరంభంలోనే టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చడంతో లంక జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. అశ్విన్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి ఓపెనర్ డిక్ వాలా (1) ను పెవిలియన్ పంపించాడు. అదే ఓవర్ లో ఆఖరి బంతికి దిల్షాన్ (1) కూడా అశ్విన్ అవుట్ చేయడంతో భారత ఆటగాళ్ళలో ఉత్సాహాన్ని మరింత పెంచాడు. మరో ఓవర్ వేసిన అశ్విన్ చండిమాల్ (8) వెనక్కి పంపాడు. దీంతో లంకేయుల జట్టు కేవలం 20 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు సమర్పించుకుంది. ఆ తర్వాత ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ పరుగులు సాధించలేకపోయారు. గునరత్నే (4), సిరివర్థన (4), శనక (19), ప్రసన్న (9) పరుగులు చేసి వెనుదిరిగారు. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా నెహ్రా, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.దీంతో టీమిండియా తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →