Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Asia Cup 2016: India beat Bangladesh by 45 runs in Mirpur Match..

By   /  February 25, 2016  /  Comments Off on Asia Cup 2016: India beat Bangladesh by 45 runs in Mirpur Match..

    Print       Email

asia cup 2016 INDIA BANGLADESH MATCH 1

పసికూనపై పంజా..!
క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఆసియా కప్‌ సమరాన్ని టీమిండియా అద్భుతంగా ఆరంభించింది. బుధవారం రాత్రి మిర్పూర్ లో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ భారత్ ఆటగాళ్ళు ఇరగదీశారు. దీంతో టీమిండియా 45 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్.. రోహిత్, పాండ్యా బ్యాటింగ్ తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. యువరాజ్‌ (15), రైనా (13) అధిక స్కోరు చేయడంలో విఫలమయ్యారు.అలాగే ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (2), కోహ్లీ (8) కూడా నిరాశ పరిచారు. ఒకానొక సమయంలో భారత్ 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే రోహిత్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవనీయమైన స్కోర్ అందించాడు. యువరాజ్‌తో నాలుగో వికెట్‌కు 55 పరుగులు.. పాండ్యాతో కలిసి ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించాడు. బంగ్లా బౌలర్లలో అల్‌-అమిన్‌ హుస్సేన్‌ మూడు వికెట్లు తీశాడు.

InCorpTaxAct
Suvidha

తర్వాత 167 పరుగుల లక్ష్య ఛేదనలో అన్ని ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ 7 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేసింది. షబ్బీర్‌ రహ్మాన్‌ (32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో నెహ్రా 3 వికెట్లు సాధించాడు. రోహిత్ కి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ విజయంతో భారత్ 2 పాయింట్లు దక్కించుకున్నట్లు అయింది. ఇక ఈనెల 27న జరిగే మ్యాచ్‌లో భారత్.. దాయాదిదేశమైన పాక్ తో తలపడనుంది.

పేసర్లకు అనుకూలించే పిచ్ పై భారత బౌలర్లు క్రమంగా వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ ఏ సమయంలోనూ విజయం దిశగా సాగలేకపోయింది. ఇన్నింగ్స్‌ 3వ ఓవర్లోనే ఓపెనర్‌ మహమ్మద్‌ మిథున్‌ (1)ను నెహ్రా బౌల్డ్‌ చేసి బంగ్లా పతనానికి నాంది పలికాడు. తర్వాత షార్ట్‌పిచ్‌ బంతితో మరో ఓపెనర్‌ సౌమ్య సర్కార్‌ (11)ను బుమ్రా అవుట్‌ చేశాడు. షబ్బీర్‌తో కలిసి కాసేపు పోరాడిన ఇమ్రుల్‌ కయిస్‌ (14)ను అశ్విన్‌ అవుట్‌ చేశాడు. అయితే విధ్వంసకర బ్యాట్స్ మెన్ షకీబల్‌ (3) రనౌటవడంతో బంగ్లాపై మరింత ఒత్తిడి పెరిగింది. భారీ షాట్లు కొడుతూ ప్రమాదకరంగా మారిన షబ్బీర్‌ను షార్ట్‌ పిచ్‌ బంతితో పాండ్యా పెవిలియన్‌ చేర్చాడు. ఆ వెంటనే నెహ్రా వరుస బంతుల్లో మహ్మదుల్లా (7), మోర్తజా (0)ను అవుట్‌ చేయడంతో బంగ్లా ఓటమి ఖాయమైంది.

స్కోర్ బోర్డ్:

టీమిండియా: రోహిత్ (సి) సౌమ్య సర్కార్‌ (బి) అమిన్‌ 83, ధవన్‌ (బి) అమిన్‌ 2, కోహ్లీ (సి) మహ్మదుల్లా (బి) మోర్తజా 8, రైనా (బి) మహ్మదుల్లా 13, యువరాజ్‌ (సి) సౌమ్య సర్కార్‌ (బి) షకీబల్‌ 15, హార్దిక్‌ పాండ్యా (సి) మహ్మదుల్లా (బి) అమిన్‌ 31, ధోనీ (నాటౌట్‌) 8, జడేజా (నాటౌట్‌) 0,ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 166/6; వికెట్ల పతనం: 1-4, 2-22, 3-42, 4-97, 5-158, 6-158;బౌలింగ్‌: తస్కిన్‌ అహ్మద్‌ 3-0-22-0, అమిన్‌ హుస్సేన్‌ 4-0-37-3, ముస్తాఫిజుర్‌ 4-0-40-0, మష్రఫె మోర్తజా 4-0-40-1, మహ్మదుల్లా 2-0-9-1, షకీబల్‌ 3-0-15-1.

బంగ్లాదేశ్‌: సౌమ్య సర్కార్‌ (సి) ధోనీ (బి) బుమ్రా 11, మహమ్మద్‌ మిథున్‌ (బి) నెహ్రా 1, షబ్బీర్‌ రహ్మాన్‌ (సి) ధోనీ (బి) పాండ్యా 44, ఇమ్రుల్‌ కయిస్‌ (సి) యువరాజ్‌ (బి) అశ్విన్‌ 14, షకీబల్‌ (రనౌట్‌) 3, ముష్ఫికర్‌ రహీమ్‌ (నాటౌట్‌) 16, మహ్మదుల్లా (సి) రోహిత (బి) నెహ్రా 7, మోర్తజా (సి) జడేజా (బి) నెహ్రా 0, తస్కిన్‌ (నాటౌట్‌) 15, ఎక్స్‌ట్రాలు:8 , మొత్తం: 20 ఓవర్లలో 121/7, వికెట్ల పతనం: 1-9, 2-15, 3-50, 4-73, 5-82, 6-100, 7-100;బౌలింగ్‌: నెహ్రా 4-0-23-3, బుమ్రా 4-0-23-1, హార్దిక్‌ పాండ్యా 4-0-23-1, అశ్విన్‌ 4-0-23-1, జడేజా 4-0-25-0.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →