Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Assembly Rowdi

By   /  June 4, 2016  /  Comments Off on Assembly Rowdi

    Print       Email

Assembly Rowdy_1991

అసెంబ్లీ రౌడీకి పాతికేళ్లు

InCorpTaxAct
Suvidha

 

 

 

శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన అసెంబ్లీ రౌడీ ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలుసు ఆ సినిమా రిలీజ్ అయి నేటి(శ‌నివారం)తో పాతికేళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఆ సినిమా హీరో మోహ‌న్ బాబు, ద‌ర్శ‌కుడు బి.గోపాల్‌, ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. మోహ‌న్ బాబు మాట‌ల్లోనే… “ఇది తమిళంలో పి. వాసు డైరెక్ట్‌ చేయగా హిట్టయిన వేలై కిడైచుడుచ్చు సినిమాకి రీమేక్‌. అప్పుడు గుర్రంలా పరుగులు పెడుతున్న బి. గోపాల్‌ను డైరెక్ట్‌ చెయ్యమంటే సరేనన్నాడు. రెండు రోజుల్లో పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్స్‌ రాసేశారు. హీరోయిన్‌గా దివ్యభారతిని ఎంపిక చేశాం. అద్భుతంగా చేసింది. నా తండ్రి పాత్రకు మొదట రావు గోపాలరావును అనుకున్నాం. ఆయన షూటింగ్‌కు ఏడింటికి కాకుండా తొమ్మిదిన్నరకు వస్తానంటే సున్నితంగా వద్దని చెప్పి జగ్గయ్యగార్ని తీసుకున్నాం.. `స్వర్గం నరకం`లో నా హీరోయిన్‌గా చేసిన అన్నపూర్ణ ఇందులో నా తల్లి పాత్రను చేశారు. కె.వి. మహదేవన్ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. అసెంబ్లీ రౌడీని 41 రోజుల్లో తీశాం. 25 వారాలు ఆడింది. తిరుపతి దగ్గర తిరుచానూర్‌లో క్లైమాక్స్‌ షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఓ ఐదుగురు కాంగ్రెస్ వాళ్లు వచ్చి గొడవ చేసి మాకు భద్రతగా ఉన్న ఓ కానిస్టేబుల్‌ను కొట్టబోతే చేతిలో ఉన్న కత్తితో తరిమాను. వాళ్లను పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించాం. సినిమా రిలీజయ్యాక అసెంబ్లీ రౌడీ అనే టైటిల్‌ పెట్టానని అసెంబ్లీలో మూడు రోజుల పాటు గొడవ. సినిమాని నిషేధించాలన్నారు. నా కటౌట్లు ధ్వంసం చేశారు. స్పీకర్‌ ధర్మారావుగారు సినిమా చూసి అబ్జెక్ట్‌ చెయ్యాల్సింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు అసెంబ్లీ రౌడీ రీమేక్‌ని చెయ్యాలని విష్ణు ఆశిస్తున్నాడు“అని  డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →