Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Astrology and Numerology

By   /  February 21, 2016  /  Comments Off on Astrology and Numerology

    Print       Email

banner-1_1450262892

జ్యోతిష్యం,న్యూమరాలజీ!

InCorpTaxAct
Suvidha

​నాకు ఒక జబ్బు ఉంది! ఆ జబ్బు వల్ల కలిగే బాధలను కూడా సహజంగా అనుభవిస్తున్నాను!కావాలని తెచ్చుకునే బాధలకు వగచి ఉపయోగం ఏమి ఉంటుంది? ఇక ఆ జబ్బు ఏమిటంటే –ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనుకోవటం!అన్నీ తెలుసుకోవటం వల్ల ఏమైనా ఉపయోగాలున్నాయా?మీకు తెలిస్తే చెప్పండి!తెలుగులో ఒక సామెత ఉంది –అన్నీ తెలుసుకున్న వాడు అమావాస్య రోజు చస్తే ఏమీ తెలియని వాడు ఏకాదశి రోజు మరణించాడని! Ignorance is a bliss ,whereas it is folly to be wise!సందర్భం వచ్చింది కనుక నిజాన్ని మీకు చెప్పాలి!న్యూమరాలజీ ,జ్యోతిష్యాన్ని గురించి నాకు కూడా తెలుసు!అయితే, ఎవరికీ చెప్పను! జ్యోతిష్యాన్ని గురించి ఎందుకు తెలుసుకున్నానో ముందుగా చెబుతాను. నా చిన్నతనంలో తూర్పు గోదావరి జిల్లాలో ఒక ప్రఖ్యాత జ్యోతిష్య సిద్ధాంతి ఉండేవారు!ఆయన పేరు సమయానికి గుర్తు రావటం లేదు!ఆయన పేరు మరచిపోవటం తప్పే!ఆయనకి భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును ఇచ్చి సత్కరించింది.ఆయనకి ఈ సత్కారం ఆయన 90 వ సంవత్సరంలో లభించింది!ఆయన మరణించి కూడా 20 సంవత్సరాలు కావస్తుంది.

ఆయన దేవీ ఉపాసకుడు.ఆయన జ్యోతిష్య శాస్త్రంలో నిష్ణాతుడని ఆ రోజుల్లో చెప్పుకునేవారు!ఆయన తన అనుభవాలను (పద్మశ్రీ సత్కారం లభించిన సందర్భంలో) ప్రజలతో పంచుకున్నారు. వాటిని మీకు కూడా చెప్పటం సమంజసం!ఆయన యవ్వనంలో దేశం మొత్తం తిరిగారు!ఒకసారి మైసూరు సంస్థానం దగ్గరికి వెళ్ళారు!మైసూరు రాజా గారు ఈయన పాండిత్యాన్ని గురించి విన్నారు!రాజు గారికి ఈయన పాండిత్యాన్ని పరీక్షచేయాలనే ఉబలాటం కలిగింది.ఒక జాతకచక్రాన్ని ఆ పండితునికి ఇచ్చి జాతకాన్ని గుణించమన్నారు!ఆ పండితుడు,ఆ చక్రాన్ని పరిశీలించి –ఇది మనిషి జాతకం కాదు,ఒక చతుష్పాద జంతువు జాతకం అని చెప్పారు! రాజు గారు ఆశ్చర్యపోయారు! ఆ జాతకం వారి ఏనుగు పిల్లది!నేను జ్యోతిష్యాన్ని నేర్చుకోవటానికి ఇది ప్రేరణ కలిగించింది! ఆ పండితుడు ఆ జాతకం చతుష్పాద జంతువుదని ఎలా చెప్పారో తెలుసుకోవటానికి ఆ రోజుల్లో నాకు వీలుపడలేదు!సరే ,నేను నేర్చుకోవటం,అది శాస్త్రం కాదని నిర్ధారణకు రావటం కూడా జరిగిపోయాయి! అది శాస్త్రం కాదని నేను నిర్ధారణకు రావటానికి గల కారణాన్ని కూడా మీకు వివరిస్తాను! ఒక సెకండ్ కి (కనురెప్ప కాలంలో) భారత దేశంలో సగటున 8 మంది జన్మిస్తున్నారట!గమ్మత్తు ఏమిటంటే –వీరిలో ఆడవారు,మగవారు కూడా ఉన్నారు!వీరందరి జాతకాలు ఒక మాదిరిగా లేవు ,ఉండవు!ముఖేష్ అంబానీ పుట్టిన టైంకే కటిక దరిద్రుడు కూడా పుట్టి ఉంటాడు.ఇంకా లోతుకి వెళితే ,అష్టమీ ,రోహిణీ నక్షత్రంలో కృష్ణుడు పుట్టిన జన్మ లగ్నంలో కూడా చాలామందే పుట్టివుంటారు. ఆయనేమో జగద్గురువు అయ్యాడు,మిగిలినవారు అతి సామాన్యులుగా మిగిలిపోయారు!అదే లగ్నంలో కొన్ని పశు పక్ష్యాదులు కూడా జన్మించాయి !దీనికి కారణమేమిటో అని కొన్ని జ్యోతిష్య శాస్త్రంలోని గ్రంధాలను పరిశీలించటం జరిగింది!’ఎవరి పూర్వ జన్మ సుక్రుతాన్ని బట్టి వారికి ఈ జన్మ లభిస్తుందని’ చెప్పి తప్పించుకున్నాయి ఆ శాస్త్రాలు!ఆ వాక్యం చదివిన తరువాత జ్యోతిష్యం మీద నమ్మకం సన్నగిల్లింది! ఇక న్యూమరాలజీని గురించి –ఇది మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉందట! దీన్ని గురించి కూడా విచిత్రమైన వాస్తవాన్ని మీకు చెప్పాలి! వాస్తవాలను చెప్పటం ధర్మం!ఎవరి అంతిమ నిర్ణయం ,conclusions వారివే!ప్రఖ్యాత రచయిత స్వర్గీయ భమిడిపాటి రాధాకృష్ణ గారి పేరు మీరు వినే ఉంటారు!ఆయన మరొక రచయిత ,’హాస్య బ్రహ్మ’అయిన భమిడిపాటి కామేశ్వరరావు గారి కుమారుడు!రాధాకృష్ణ గారు 1960 దశకంలో చాలా సినిమాలకు కధలు,సంభాషణలను వ్రాసారు!ఆ రోజుల్లో సంచలనం సృష్టించిన’కధానాయకుడు’సినిమాకి ఈయనే సంభాషణల రచయిత!ఈ విషయాలు అందరికీ తెలిసే ఉండొచ్చు! ఆయనలో తెలియని కోణం మరొకటి ఉంది! అదే న్యూమరాలజీ!ఈయనకు న్యూమరాలజీలో మంచి పేరుంది!రాధాకృష్ణగారు చనిపోయి 7,8 సంవత్సరాలు కావస్తుంది!ఈయన తన డైరీలో ఫలానా తారీకున మరణిస్తానని వ్రాసుకున్నారట ! ఆ రోజు డైరీలో ఆయన ఇలా వ్రాసుకున్నారట –ఈ రోజు నేను బాల్చీ తన్నేస్తాను అని ! ప్రఖ్యాత హిందీ నటుడు అయిన అనిల్ కపూర్ రాజమండ్రీకి outdoor షూటింగ్ నిమిత్తం వచ్చినప్పుడు ఈయనను కలిసారట! ఆయన అప్పుడు బాపు గారి’వంశవృక్షం’ సినిమాలో నటిస్తున్నారు!అదే ఆయన మొదటి సినిమా అనుకుంటాను!ఆ సందర్భంలో ఆయన రాధాకృష్ణ గారిని కలిస్తే ఆయనే వీరి పేరును అనిల్ కపూర్ గా మార్చారట!అంతకుముందు పేరేమిటో నాకు తెలియదు!

అలాగే ప్రఖ్యాత తమిళ నటుడు విక్రం పేరును కూడా వీరే మార్చారట!ఈ విషయాలన్నీ రాధాకృష్ణ గారబ్బాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పటం జరిగింది!ఆ ఇద్దరు నటులు పైకి రావటానికి కారణం,వారిలోని టాలెంటే అని నేను నమ్ముతాను!అలా,ఆయన పేరు మార్చిన వారందరూ ప్రఖ్యాతి చెందలేదుగా! ఇక ఆయన మరణాన్ని గురించి ఆయనే చెప్పటం కాకతాళీయమే కావచ్చు! తల్లితండ్రులు బాలసారె చేసి మంచి పేరు పెడితే ,అది కలసి రాలేదని మార్చుకోవటం అజ్ఞానమే!నిజానికి ఈ సృష్టిలో(cosmos) మనం గుర్తించబడేది తల్లితండ్రులు పెట్టిన పేరునుబట్టే! కొన్ని జ్యోతిష్య శాస్త్రాల్లో పేరును బట్టే ఫలితాలను చెబుతుంటారు!సన్యాసులు తమ తల్లితండ్రులు పెట్టిన పేరును త్యజిస్తారు!నిజానికి దాని అంతరార్ధం-గతాన్ని మర్చిపోవటం!అయితే,నేను సాధన చేస్తున్న యోగాసాధనలో మా మాస్టర్ physical గా ఉన్నప్పుడు,ఆయన దగ్గరికి కాషాయవస్తాలు ధరించిన ఒక వ్యక్తి వచ్చి,ఆయనకు కూడా initiation ఇవ్వమని మాస్టర్ ని కోరాడట!మాస్టర్ ఆయన పేరు అడిగితే,–నృసింహ భారతి అని చెప్పాడట ఆ వచ్చినాయన!వెంటనే మాస్టర్ ఈ కాషాయ వస్త్రాలను తీసేసి మీ తల్లితండ్రులు పెట్టిన పేరు ఉంచుకొని వస్తేనే నేను initiation ఇస్తానని చెప్పారట !మనం ఈ సృష్టిలో ఎలా గుర్తించబడ్డామో అలానే ఉండాలి!కృత్రిమమైన పేర్ల వల్ల ఉపయోగాలు ఏమీ ఉండవు!అయితే కొందరు రచయితలు వారి కలం పేర్ల ద్వారానే ప్రఖ్యాతి చెందిన మాట వాస్తవమే!ఆత్రేయ,ఆరుద్ర,శ్రీ శ్రీ –ఇలా చాలామందే ఉండొచ్చు!కానీ వారిలో చాలామంది వారి లావాదేవీలన్నీ అసలు పేరుతోనే జరుపుతుండేవారు!పేరులో ఏముంది ?పేరులో నేముంది(name)!దీన్ని గురించి చాలా రోజుల క్రితమే ఒక వ్యాసాన్ని వ్రాసాను!

టీవీయస్.శాస్త్రి

878_TVS shastry

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →