కరుణ కొంప ముంచిన ఉచిత హామీలు
ఏదైనా ఉచితంగా వస్తోంది అంటే ఎవరైతే వద్దంటారు. మరీ ముఖ్యంగా తమిళులు. అన్నీ ఫ్రీ కావాలనుకునేవాళ్లల్లో తమిళులు ముందుంటారు. తమిళుల పల్స్ పట్టుకున్న జయలలిత విజయం సాధించగా.. అసలు ఉచితం అని పదమే మేనిఫెస్టోలో చేర్చని కరుణ ఓటమి పాలయ్యారు. ఉచితాలను మనసులో పెట్టుకున్న రాష్ట్రప్రజలు డీఎంకే మేనిఫెస్టోను ఎన్నిసార్లు తిరగేసినా.. అలాంటివి ఏవీ కనిపించలేదు. మరోవైపు పాలక అన్నాడీఎంకే మహిళలకు ద్విచక్రవాహనాలకు 50 శాతం సబ్సిడీ – 100 యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలు ఉచితం వంటి కొత్త హామీలతో పాటు అంతకముందు జనాదరణ పొందిన అమ్మ పథకాలు ఎలాగూ ఉన్నాయి. దీంతో డీఎంకే విజయానికి ఇవన్నీ బ్రేకులు వేశాయని చెప్తున్నారు. మొత్తానికి ఒకటే రుణమాఫీ మంత్రం ఒడ్డుకు చేరుస్తుందనుకున్న కరుణానిధి అంచనా వైఫల్యం అయిందని రాజకీయవర్గాలు అంటున్నాయి.
కరుణానిధి తమ కొత్త హామీగా రైతు రుణమాఫీని ప్రకటించారు. అంతేకాకుండా మహిళా రుణాలు – విద్యారుణాలను కూడా మాఫీ చేస్తానని చెప్పారు. అయినప్పటికీ అవేవీ మంచి ఫలితాన్ని తీసుకురాలేకపోయాయి. 2014 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధంపై నిరసనలు ఎగసిపడ్డాయి. ప్రతిపక్షాలు సైతం జెండాలు పట్టుకోవడంతో రాష్ట్రంలో ఇదే పెద్ద విప్లవంగానూ మారింది. మద్యనిషేధ హామీకి ప్రజాదరణ ఎక్కువగా ఉందని భావించిన డీఎంకే తాము ప్రభుత్వంలోకి వస్తే తొలి సంతకం మద్యనిషేధంపైనే అని కరుణానిధి చెప్పారు. ఈ అస్త్రం మహిళా ఓటర్లపై ప్రభావం చూపుతుందని డీఎంకే భావించింది. మేనిఫెస్టోలో మార్పు దిశగా పలు అంశాలను ప్రస్తావించింది. కానీ ఇవేనీ జయలలిత ఉచిత హామీల ముందుర కరుణ నిధి హామీలు కనిపించకుండా పోయాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.